Home నవ విజ్ఞానం క్యాన్సర్ రోగుల పాలిట సంజీవని ఇమ్యునోథెరపీ

క్యాన్సర్ రోగుల పాలిట సంజీవని ఇమ్యునోథెరపీ

introduce cancer patient

 

వేరే వారి నుంచి వ్యాధినిరోధక కణాలను సేకరించి క్యాన్సర్ రోగిలో ప్రవేశపెట్టి వ్యాధిని నివారించే కొత్త చికిత్సా విధానాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భవిష్యత్తులో ఈ వైద్యవిధానం వల్ల కొన్ని కోట్ల మంది క్యాన్సర్ రోగులకు మేలు జరుగుతుందన్న విశ్వాసాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త చికిత్స తొలిదశ లోనే ఉంది. కిమోథెరపీని రోగులు చేయించుకున్నప్పుడు ఎదురయ్యే చిక్కులు నివారించడానికి వ్యాధి నిరోదక శక్తిని పొంపొందించడానికి ఈ చికిత్స ఉపయోగపడుతుందని చెప్పారు. లండన్‌కు చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్ ఈమేరకు మొదట ఇమ్యూన్ కణాల బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్షంతో ఉన్నారు. ఇమ్యూన్ కణాలు అంటే వ్యాధి నుంచి రక్షించే కణాలు. సహజంగా ఇవి వ్యాధి నుంచి కాపాడే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ బ్యాంకులే ఏర్పడితే ఆంకాలజిస్టులు తమ కు కావలసిన ఇమ్యూన్ కణాలను క్షణాల్లో ఆర్డరిచ్చి రప్పించుకుని రోగిలో ఇంజెక్టు చేయడానికి వీలవుతుంది.

దానివల్ల ఆ రోగిలో సహజమైన వ్యాధి నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. వ్యాధిపై నేరుగా దాడి చేయడం కన్నా వ్యాధి నివారణ మరో రూపంలో చేయవచ్చని కొన్నేళ్ల క్రితమే నమ్మకం ఉండేదని ఇమ్యునోసర్వేలెన్స్ ల్యాబ్ (క్రిక్ ల్యాబ్ ) పరిశోధక బృందం నాయకులు ప్రొఫెసర్ ఎడ్రియన్ హేడ్లే పేర్కొన్నారు. ఈరోజు రోగి శరీరమే వ్యాధి నిరోధంగా తయారయ్యేలా శిక్షణ ఇచ్చే పరిశోధనలు, ప్రయోగాలు ముమ్మరంగా విస్తరిస్తున్నాయని చెప్పారు. ఇది మామూలు సంప్రదాయ వైద్య చికిత్స కన్నా చాలా సమర్థంగా ఉంటుందని ఎందుకంటే మం దుల కంపెనీలు కన్నా శరీరాలు వేగంగా దీన్ని గ్రహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి సహజమైన రక్షణ కణాలను రోగులు గ్రహించ గలుగుతారని పరిశోధకులు వివరించారు. శరీరం లోని రక్షణ వ్యవస్థను ఉపయోగించి క్యాన్సర్ కణుతులను గురి చేసుకోవడం అద్భుతమని, ఎందుకంటే కణుతులు వేగంగా విస్తరిస్తుంటాయని, ఫార్యాక్యూటికల్ కంపెనీలు కూడా ఈ విస్తరణను అడ్డుకునే మార్గం అవలంబించ లేవని పరిశోధకులు పేర్కొన్నారు.

వ్యాధి నిరోధక శక్తి మనిషిలో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కొనసాగుతోందని చెప్పా రు. ఎవరో ఒకరి వ్యాధి నిరోధక కణాలను (ఇమ్యూన్ కణాలను) మరో వ్యక్తిలో ఇంజెక్టు చేస్తే దాన్ని ఆ రోగి శరీరం గ్రహించ దేమో అన్న భయం ఇప్పటి వరకు ఉండేదని కానీ పరిశోధనల్లో అలాంటి ప్రతిఘటన ఉండదని నిర్ధారణ అయిందని పరిశోధకులు వివరించారు. క్రిక్ పరిశోధక బృందం ఈమేరకు ఆసక్తి కరమైన ఫలితాలను సాధించగలుగుతోంది. ముఖ్యంగా ఇమ్యూ న్ కణాలను శరీరం కొన్ని రకాల ఇమ్యునోథెరపీల వల్ల తిరస్కరించడం జరగలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఇమ్యూన్ వ్యవస్థ బలంగా ఉండడానికి, వ్యాధి కారక కణాలను సంహరించడానికి తగినట్టు ఇమ్యునోధెరపీ డ్రగ్స్ సహకరిస్తున్నాయి. అయితే కొన్ని చిక్కులు ఈ థెరపీ వల్ల ఎదురవుతున్నాయి. ఆరోగ్యకరమైన కణాలపై కూడా దాడి జరుగుతోంది.

చివరికి ఈ చికిత్స నీమట్టుకు నువ్వు సమీపించు అని చెబుతోంది. ఎందుకంటే మందులతో నిమిత్తం లేకుండా వ్యాధిని ఎదుర్కొనే శక్తి స్వయ ంగా రోగి సాధించుకోగలుతుండడమే. ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో క్యాన్సర్ రోగుల జీవించే కాలం పదేళ్లు కన్నా ఎక్కువగా 50 శాతం పెరగిందని బ్రిటన్‌లోని క్యాన్సర్ రీసెర్చి వెల్లడించింది. ఈ శాతాన్ని మరో15 ఏళ్లలో 75 శాతం వరకు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెక్నాలజీలో మరింత అభివృద్ధి చెందడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. అమెరికాలో క్యాన్సర్ రోగుల జీవిత కాలం ఐదేళ్ల పాటు పెరిగింది. 2007 నుంచి 2013 మధ్యకాలంలో 69 శాతం పెరిగింది.

ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది?
మన వ్యాధినిరోధక వ్యవస్థను ఇమ్యునోథెరపీ మరింత బలోపేతం చేస్తుంది. ఎలాంటి వ్యాధులకు అస్వస్థతలకు లోను కాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. లింఫ్ గ్రంధులు, ప్లీహం, తెలరక్త కణాలు,ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ వ్యవస్థ శరీరం లోని పొరపాటుగా ఉన్న కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. క్యాన్సర్ వృద్ధి చెందకుండా కాపాడుతుంది. అయితే వ్యాధి నిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించినా దాన్ని అడ్డుకోలేదు. అలాంటప్పుడు ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. క్యాన్సర్ కణాలు సంకేతాలు వెలువరించి వ్యాధి నిరోధక వ్యవస్థ తమపై దాడి చేయకుండా అడ్డుకుంటాయి. అంతే కాదు వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ వ్యవస్థ )కు దొరక్కుండా దాక్కుంటాయి.

ఇమ్యునోథెరపీకి తక్కువ ప్రచారం
సర్జరీ, కిమోథెరపీ,రేడియో థెరపీ మాదిరిగా ఇమ్యునోథెరపీ అంత వాడుకలో లేదు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కిమోథెరపీని వినియోగిస్తారు. రేడియో థెరపీ అంటే రేడియేషన్‌ను వినియోగించడం. సాధారణంగా ఇందులో వ్యాధి చికిత్సకు ఎక్సురే కిరణాలను వినియోగిస్తారు. వీటన్నిటికీ భిన్నం ఇమ్యునోథెరపీ. శరీరం లోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇమ్యునో థెరపీ బాగా ఉపయోగపడుతుంది. వీటిని బయోలాజికల్ థెరపీ అని కూడా అంటారు.

                                                                                                                 – సైన్స్ విభాగం

New treatment method to introduce cancer patient and prevent disease

Telangana Latest News