Home రాష్ట్ర వార్తలు జూబ్లీహిల్స్ టు నందిగామ

జూబ్లీహిల్స్ టు నందిగామ

Chigurupati Jayaram Murder Caseచిగురుపాటి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు, పోలీసు కస్టడీకి రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్

హైదరాబాద్: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులను మంగళవారం మూడు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది.నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను రెండు వారాలపాటు కస్టడీకి అనుమతించాలని కోరుతూ నాంపల్లి కోర్టు జడ్జి ముందు జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరిచారు. విచారించిన కోర్టు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవచ్చని అనుమతినిచ్చింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు జయరాం హత్య కేసు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో అధికారులు విచారించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు మేరకు శిఖా చౌదరి, ఆమె డ్రైవర్, వాచ్‌మెన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. అదేవిధంగా రాకేష్‌రెడ్డి ఇంట్లో పనిచేసే వారిని సైతం అదుపులోకి తీసుకోనున్నారు. ముఖ్యంగా హత్యకు ముందు జయ రాం కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు సాగనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.

రాకేష్‌రెడ్డి నేర చరిత్రపై ఆరా..!
చిగురుపాటి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి నేర చరిత్రపై నగర పోలీసులు దృష్టిసారించారు. గతంలో అతనిపై నమోదైన క్రిమినల్ కేసులపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో వ్యభిచారం చేయించిన కేసులో రాకేష్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన వివరాలను ఇప్పటికే సేకరించారు. రాకేష్‌రెడ్డి గతంలో నిర్వహించిన హైటెక్ వ్యభిచారం ముఠాకు సంబంధించిన కేసులను పరిశీలిస్తున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరుతో బెదిరించి ఓ వ్యక్తి నుంచి రూ.80 లక్షలు వసూలు చేసిన ఘటనకు సంబంధించిన వివరాలతోపాటు మిగిలిన వారి వివరాలను సేకరించనున్నారు. రాకేష్‌రెడ్డి బ్లాక్ మెయిల్ బాధితులలో అరబిందో ఫార్మ ఎండి నిత్యానందరెడ్డి ఉన్నట్లు పోలీసు లు గుర్తించారు. దీపక్ నైట్రేట్, సరస్వతి కెమికల్, పర్చివ్‌ల్యాబ్స్, కళానికేతన్ ఎండి లీలాకుమార్, గ్రీన్‌బావర్చిల నుంచి డబ్బులు వసూళ్లపై విచారణ చేపడుతున్నారు.

జయరాం కాల్‌డేటాపై విచారణ
జయరాం ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఎవరెవరికి ఫోన్లు చేశాడు, వాట్సప్ కాల్, చాటింగ్ అంశాలకు సంబంధించి జయరాం కాల్‌డేటాను పోలీసులు సేకరించారు. ఈక్రమంలో ఒక యువతి పేరిట వచ్చిన కాల్స్ రాకేష్‌రెడ్డి ద్వారానే వచ్చాయని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. రీనా పేరిట చేసిన కాల్స్‌లో ఉన్న విషయాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ముఖ్యంగా రీనా పేరిట చేసిన ఫోన్ కాల్స్ మేరకు
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ ఇంటికి వెళ్లిన జయరాంను రాకేష్‌రెడ్డి తాళ్లతో కట్టి వేధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. గృహనిర్భంధంలో ఎవరెవరికి ఫోన్లు చేశారన్న కోణంలో దర్యాప్తు సాగనుంది. 12 గంటల పాటు డబ్బు వసూళ్ల కోసం జయరాంను తీవ్రంగా హింసిస్తూ ఎవరెవరికి ఫోన్లు చేయించారు, ఈక్రమంలో జయరాం మేనకోడలు శిఖా చౌదరికి ఫోను చేసిన అంశాలపై దర్యాప్తు సాగుతోంది. కోస్టల్ బ్యాంక్ మాజీ మేనేజర్ రూ.6 లక్షలు పంపించంగా, ఎవరు తీసుకున్నారన్న విషయాలపై పోలీసులు దృష్టిసారిస్తున్నారు.

జయరాం అప్పుపై అరా..!
ఎన్నారై జయరాంకు రూ.6 కోట్ల అప్పు రాకేష్‌రెడ్డి ఎలా ఇచ్చాడు. మొత్తాలు ఎక్కడి నుంచి ఆయా మొ త్తా లు ఎవరి నుంచి వసూలు చేశాడన్న కోణంలో పోలీసు దర్యా ప్తు సాగనుంది. అలాగే రాకేష్‌రెడ్డి హైదరాబాద్‌లో స్థిరా స్తి వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలపై పో లీసు లు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. రాకేష్ రెడ్డి మూడు దఫాలుగా రూ.6 కోట్లు జయరాంకు అప్పు ఇచ్చాడన్న అంశాలపై విచారణ చేపడుతున్నారు.

పోలీసుల పాత్రపై దర్యాప్తు
జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్‌రెడ్డికి స్థానిక పోలీసులు సహకరించారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. జయరాం ఘటనలో ఇబ్రహీం పట్నం ఎసిపి మల్లారెడ్డి, నల్లకుంట్ల సిఐ శ్రీనివాస్‌లపై పో లీసు ఉన్నతాధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే. జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్‌రెడ్డితో ఎసిపి, సిఐలు పోన్లో మాట్లాడిన అంశాలపై దృష్టిసారించనున్నారు. అలాగే రాకేష్, ఎసిపి, సిఐ ల మధ్య ఏర్పడిన పరిచయంపై ఆరా తీస్తున్నారు. జ యరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకంరించేందుకు స్థానిక పోలీసు టల అధి కారుల పాత్రపై దర్యాపు చేపడుతున్నారు.

కీలకంగా మారిన పద్మశ్రీ ఫిర్యాదు
తన భర్త జయరాంను శిఖారెడ్డి, ఆమె తల్లి చంపించారని మృతుడి భార్య పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన కేసు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పద్మశ్రీ తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశంపై విచారణ చేయనున్నారు. జయరాం సోదరి, ఆమె కుమార్తె శిఖాతో ప్రాణహాని, జయరాం ఇండియాకు రావడానికి గల కారణాలపై ప్రత్యేక బృందాలతో విచారణ చేపడుతున్నారు. శిఖా చౌదరికి జయరాం మృతి చెందిన సమాచారం తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా జయరాం ఫ్లాట్‌లో జగిత్యాలలోని 10 ఎకరాలకు సంబంధించిన డాక్యూమెంట్లు దొంగిలించిన వైనంపై వివరాలు సేకరించనున్నారు.

New Twist in Chigurupati Jayaram Murder Case