Saturday, February 4, 2023

రిజిస్ట్రేషన్‌లో కట్టుకథలు

ఖమ్మం నగరంలో కొంత కాలంగా సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. వివాదాస్పద స్థలాలను దక్కించుకోవటం, లేదా బెదిరించి అసంబద్ధ హక్కు పత్రాలు, వాటా కొట్టియేటం, రొక్కం పుచ్ఛుకోవటమే ఈ కొత్త వ్యాపారం. ఇందు కోసం కొన్ని ముఠాలు ఏర్పడ్డాయి. స్థల అన్వేషణలు జరిగిపోతున్నాయి. ఎవరు, ఎలా, ఎప్పుడు అంటూ కూపీలు లాగటం మనదేంటి అంటూ రంగంలోకి దిగటం ఆర్ధికంగా లాభం పొందటం, ఈ వ్యాపారానికి రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు యధాశక్తి సహకరిస్తున్నారు. తాము దొరక్కుండా చట్టానికి లోబడి అక్రమానికి పాల్పడుతున్నారు. చట్టంలోని లొసుగులు తమకు నచ్చి డబ్బు ఇచ్చే చుట్టాలకు చూపెడుతున్నారు. ఒక్క నగరంలోనే వందలాది స్థలాలు ఈ ముఠాల గుప్పెట్లో ఉన్నాయి. సామాన్యులు వైదొలుగుతుండగా సమఉజ్జీలు సిగలు పట్టుకుంటున్నారు.

  • వివాదాస్పద స్థలాలపై ప్రత్యేక కన్ను
  • లోపాలు చూపి కోట్లు దండుకుంటున్న రిజిస్ట్రేషన్ అధికారి
  • అసంబద్ధ పత్రాలతో హక్కుపొందే యత్నం
  • బెదిరింపులు- చెల్లింపులు
- Advertisement -

Land-Mafia

ఖమ్మం నగరంలో రద్దీ ప్రాంతాలలోనూ ఇటీవలే అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనూ ఖాళీ స్థలాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ స్థలాలు అత్యంత విలువైనవి కావటంతో ఏ సంబంధం లేకున్న ఇప్పుడు వాటిని కాజేసే ప్రయత్నం చేయటమే వ్యాపారంగా మారింది. దీనికి రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు యధాశక్తి సహకరిస్తుండటంతో లింకు డాక్యుమెంట్ల సృష్టి, వారసులు వేతుకులాట, వెంటవెంటనే జరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగం
తాము దోరక్కుండా తప్పించుకుంటు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇటీవల ఒక రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అవలింభించిన ఉదాసీన వైకారి వెలుగు చూడటంతో ఓ అధికారి బాగోతం బట్టబయలైంది. పాకబండ బజారు రెవిన్యూలోని సర్వే నెంబర్ 39, 39/బిలో సుమారు 6 వేల గజాలు వివాదం లో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఐదుగురి మధ్య వివాదం నడుస్తుంది. రకరకాల వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించు కుని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదే స్థలంపై మరో ముఠా కన్నుపడింది. విజయవాడ నగర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కూడా రిజిస్ట్రేషన్ అయినప్పటికీ చట్ట బద్ధత రాలేదు. అటువంటి వ్యక్తిని బెదిరించి ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న అతని ద్వారా బెదిరించి బలవంతంగా ఓ ముఠా సంతకాలు చేయించింది. రిజిస్ట్రేషన్ కార్యా లయం నుండి సంబంధిత పత్రాలు తీసుకు వెళ్లి సంతకాలు చేయించినా దోరికిపోయారు. ఈ ముఠాలోని కొందరి పేరున జరిగిన ఈ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వ్యక్తి కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపారు. రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసిన ప్పుడు జనరల్ పవర్ ఆఫ్ అటార్‌నికి వాడవల్సిన ధృవపత్రం వాడవల్సిన అవసరం లేదు. కానీ రిజిస్ట్రేషన్‌లో ఆ పత్రాన్ని సైతం జతపరిచారు. ఇక్కడా మరొ ఎత్తుగడను అవలింభించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయకుడదు. కానీ గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి మరో వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయవచ్చా అని అడగటం న్యాయవాది చేయవచ్చునని చెప్పిన పత్రాలను జతచేశారు. పది కోట్ల రూపాయల విలువైన ఈ భూమికి సంబంధించి దాదాపు రిజిస్ట్రేషన్ వ్యవహరంలో రూ. 20 లక్షలు చేతులు మారాయి. రిజిస్ట్రేషన్ అధికారి పెద్ద మొత్తంలో పుచ్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువం టివి వందల సంఖ్యలో ఉన్నాయి. అసలు హక్కుదారు ఈ భూమి నాదేనని నిరుపిం చుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయటంతో పాటు అంగబలం కూడా అవసర మవుతుంది. ఈ వ్యాపారం కొందరికి కాసుల వర్షం కురుపిస్తుండగా నిజమై న హక్కుదారు తమదని నిరూపించుకోలేక రాజీ పడుతున్నారు. వారసులు హక్కుదారు లు అంటూ సృష్టిస్తున్న కట్టుకథలకు కళ్లేం వేయకపోతే భవిష్యత్‌లో మరిన్ని అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అక్రమార్కులకు అధికార సహకారం పైన దృష్టి సారించాలి. అధికార యంత్రాంగాన్ని కట్టడి చేస్తే సగం వివాదాలకు తెరపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles