Thursday, April 25, 2024

ట్రంప్‌కు షాక్..

- Advertisement -
- Advertisement -

ట్రంప్‌కు షాక్
రూ. 41 కోట్లు జరిమానా
న్యూయార్క్: మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లైంగిక వేధింపుల కేసు ఇరకాటంలో పెట్టింది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్‌పై లైంగిక వేధింపులకు ట్రంప్ పాల్పడడం వాస్తవమేనని న్యూయార్క్ కోర్టు నిర్ధారించింది. ఈనేరానికి ఐదు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.41 కోట్లు జరిమానా విధించింది. 1990లో తనపై ట్రంప్ లైంగికంగా దాడి చేశారని మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ ఇటీవల ఆరోపించగా, దీనిపై న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు విచారణ చే పట్టి తీర్పు వెలువరించింది.

అయితే అత్యాచారం తనపై జరిగిందని కారొల్ ఆరోపించడాన్ని ఫెడరల్ కోర్టు తోసిపుచ్చింది. కానీ కారొల్‌పై లైంగిక వేధింపులు జరగడం వాస్తవమేనని, దానికి ట్రంపే బా ధ్యుడని, దీనికి పరిహారంగా 5 మిలియన్ డాలర్లు ఆమెకు చెల్లించక తప్పదని జ్యూరీ ఆదేశించింది. ఈ విచారణకు ట్రంప్ హాజరు కాలేదు. ఈలోగా ట్రంప్ సోషల్ మీడియాలో ‘నాపై మోపిన తప్పుడు ఆరోపణలపై జ్యూరీ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నా ను’ అని రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా తనను మాట్లాడడానికి, తన మట్టుకు తాను రక్షించుకోడానికి అవకాశం ఇవ్వడం లేదని ట్రంప్ ఆరోపించా రు. విలేఖరులు ఈ కేసుపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వీలు కలగడం లేదని ఆరోపించారు. 1996లో మన్‌హట్టన్ లోని డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో కారొల్‌కు ట్రంప్‌తో పరిచయమైంది. తన తో చనువుగా మాటలాడుతూ ఒంటరిగా ఉన్న తన పై లైంగిక దాడికి ట్రంప్ పాల్పడ్డారని కారొల్ ఆరోపించారు. అత్యాచార బాధితురాలిగా తాను భావించనందున ఆనాడు పోలీస్‌లకు ఫిర్యాదు చేయలేదని కారొల్ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్నేళ్లకు ఆమె ఈ వివరాలను 2019లో న్యూయార్క్ మ్యాగజైన్‌లో ప్రచురించారు. దీనిపై ట్రంప్ ఆగ్రహంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కారొల్ కోర్టుకెక్కారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News