Home అంతర్జాతీయ వార్తలు బిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని…

బిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని…

Arnod-jesibda

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసండా ఆర్డెర్న్(37) గురువారం ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధానమంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన మొదటి స్త్రీ గా ఆమె రికార్డు నెలకొల్పారు. ఆమెకు పుట్టిన పాప 3.31 కిలోల బరువు ఉంది. ఆరోగ్యవంతమైన పాపకు జన్మనివ్వడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆక్లాండ్ సిటి హాస్పిటల్ వైద్యులకు  జెసెండా ఇన్ స్టాగ్రామ్  ద్వారా ధన్యవాదాలు తెలిపారు. తాను బిడ్డను ఎత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆమె మెటర్నిటీ లీవ్ లో ఉండడంతో మరో 6వారాల పాటు డిప్యూటి ప్రైమ్ మినిస్టర్ విన్ స్టన్ పీటర్స్ తాత్కాలికంగా ప్రధాని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి వ్యక్తిగా పాకిస్థాన్‌కు చెందిన బెనజీర్ భుట్టో రికార్డ్ లో ఉన్నారు. ఆమె 1990లో ప్రధాని పదవిలో ఉండగానే మాతృమూర్తి అయ్యారు. వాస్తవానికి న్యూజిలాండ్ ప్రధాని పదవి చేపట్టడానికి కేవలం 6 రోజుల ముందే గత సంవత్సరం అక్టోబర్ 13న తాను గర్భవతినని జెసిండా తెలిపారు. ఈ విషయాన్ని ఈ ఏడాది మొదట్లో తెలియజేశారు. ఆగస్ట్ మొదటి వారంలో తాను మళ్లీ బాధ్యతలు చేపట్టబోతున్నట్టు జెసిండా స్పష్టం చేశారు.