Home తాజా వార్తలు ఆదుకున్న నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌… పాక్ లక్ష్యం 238

ఆదుకున్న నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌… పాక్ లక్ష్యం 238

 

బర్మింగ్హమ్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో కివీస్, పాకిస్థాన్ జట్టుకు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమిర్ బౌలింగ్‌లో కివీస్ ఓపెనర్ గుప్తిల్(5) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత షాహీన్ ఆఫ్రిదీ తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ మన్రో(12), రాస్ టేలర్(3)లను పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్ కు గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన లాథమ్(1) ఘోరంగా విఫలమయ్యాడు.

ఈ దశలో నిలకడగా ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్స్(41) కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ జట్టు 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో నీషమ్‌(97), గ్రాండ్‌హోమ్‌(63)లు అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి పాక్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో కివీస్ 237 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసి మళ్లీ రేసులోకి వచ్చింది. పాకిస్థాన్ బౌలింగ్‌లో షహీన్ 3 వికెట్లు పడగొట్టగా.. అమీర్, షాబాద్ లు తలో వికెట్ తీశారు.

New Zealand to set 238 runs target against Pakinstan