Wednesday, April 24, 2024

అప్పుడే పుట్టిన బిడ్డను పొదల్లో వదిలేశారు

- Advertisement -
- Advertisement -

newborn baby found in bushes at vikarabad

స్థానికులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలింపు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు

వికారాబాద్: అప్పుడే పుట్టిన బిడ్డను పొదల్లో వదిలి వెళ్లిన సంఘటన వికారాబాద్ పట్టణంలోని చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగుల గుడి వద్ద ఉన్న పొదల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలేసి వెళ్లారు. చుట్టు పక్కల వారు గమనించి వెంటనే బాలున్ని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అదే విధంగా చైల్డ్ స్పెషలిస్టు డాక్టర్ శాంతప్పకు సమాచారం అందడంతో ఆసుపత్రికి వచ్చి బాలుడికి వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉన్నాడని, 1.8 కిలోలు ఉన్నట్లు తెలిపారు. బాలుడిని తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

newborn baby found in bushes at vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News