Home తాజా వార్తలు చెత్తకుప్పలో పసికందు..

చెత్తకుప్పలో పసికందు..

Baby found

 

వికారాబాద్: ఓ కసాయి తల్లి పండంటి ఆడబిడ్డను చెత్తకుప్పలో పడేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు, అంగన్ వాడీ టీచర్ ఘటనా స్థలానికి చేరుకొని పసికందును పరిశీలించారు. అవాంఛిత గర్భాన్ని వదిలించుకునేందుకు ఏ యువతి అయినా ఇలా చేసిందా? లేదా ఆడపిల్ల పుట్టిందని ఎవరైనా తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు చెత్తకుప్పలో వదిలేశారమో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పసిపాపను చెత్తకుప్పలో వదిలేయడంతో స్థానికులు కసాయి తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పాపను పరిశీలించిన వైద్యులు పసికందు గొంతుపై, కంటిపై బలమైన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. పసికందు శరీరంపై గాయాలు ఉన్నయని, పాప పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. తాండూరు డాక్టర్ల సలహ మేరకు మెరుగైన వైద్యం కోసం పాపను హైదరాబాద్ నిలోఫర్ దవాఖానకు తరలించారు.  పాపను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన్నట్లుగా పోలీసులు తెలియజేశారు.

Newborn baby found in dustbin in vikarabad