Thursday, March 28, 2024

కన్నతల్లికి ఆడబిడ్డ భారమైందా?

- Advertisement -
- Advertisement -

Newborn baby found on roadside in Nagarkurnool

వంగూరు: ఆ తల్లికి ఆడబిడ్డ భారంగా మారిందా లేక ఏదైన కష్టంతో కన్నకూతురిని వదిలించుకుందో తెలియదు కాని నవజాత శిశువును నిర్ధాక్షిణంగా ఒక సంచిలో పెట్టి రోడ్డు పక్కన వదిలిపెట్టి వెళ్ళింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ శివారులోని వంకబాయి వద్ద ఒక సంచిలో అప్పుడే పుట్టిన ఆడశిశువును స్థానికులు బుధవారం గుర్తించారు. అటుగా వెళ్తున్న కొండారెడ్డిపల్లి గ్రామ యువకులు పసికందు ఏడుపులు వినిపించగా గుర్తించి హెల్త్ డిపార్టుమెంట్ వారికి సమాచారం అందించారు. వారికి సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి చేరుకొని ఆడశిశువును తీసుకున్నారు. పాప ఆరోగ్యం బాగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. నవజాత శిశువును ఐసిడిఎస్ అధికారులకు అప్పగించామని వైద్యాధికారులు తెలిపారు.

Newborn baby found on roadside in Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News