Friday, April 26, 2024

విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్‌సి విచారణ..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం ఢిల్లీలో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో 194 కాలేజీలను తనిఖీ చేశామని అందులో లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. ఆ మేరకు కోటి 80లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించినట్లు నివేదికలో పేర్కొంది. అనధికారికంగా హాస్టల్ నడుపుతున్న కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, సెలవు రోజుల్లో క్లాసులో నిర్వహణపై కాలేజీలకు జరిమానా విధించినట్లు తెలిపింది. నివేదికను పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ విద్యార్థుల సమస్యలపై తల్లిదండ్రులతో కాలేజీ యాజమాన్యాలు ఓరియంటేషన్ జరపాలని ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది. కాగా, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది.

NHRC Inquiry over TS Inter Students Suicides

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News