Thursday, April 25, 2024

నిజామాబాద్ పిఎఫ్‌ఐ కేసులో 11 మందిపై ఎఐఎ అభియోగపత్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వ్యక్తులను రిక్రూట్ చేయడం వంటివి చేస్తున్నదని పేర్కొంటూ, ఆ సంస్థకు చెందిన 11 మందిపై హైదరాబాద్‌లోని స్పెషల్ కోర్టులో జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఎ) అభియోగపత్రం దాఖలు చేసింది. కేసు మొదట తెలంగాణకు చెందిన నిజామాబాద్ జిల్లాలోని పిఎస్ 6 టౌన్‌లో నమోదయింది. కానీ తర్వాత ఆ కేసును 2022 ఆగస్టులో ఎన్‌ఐఎ తీసుకుంది.

‘అమాయక ముస్లిం యువకులను ర్యాడికలైజ్ చేయడం, ప్రసంగాల ద్వారా ప్రభావితం చేసి పిఎఫ్‌ఐలోకి చేర్చుకోవడం, భారత ప్రభుత్వంపై విద్వేషం, విషం వెల్లగ్రక్కడం చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది’ అని ఎన్‌ఐఎ తన అభియోగపత్రంలో పేర్కొంది.
‘ముస్లిం యువకులను ఒకసారి రిక్రూట్ చేసుకున్నాక వారిని యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్(పిఈ) బిగినర్స్ కోర్సుల పేరిట శిక్షణ శిబిరాలకు పంపుతారు, వారికి ప్రతిరోజు కత్తులు, కర్రలు, ఇనుప కడ్డీలు ఎలా ఉపయోగించాలి… అవతలి వ్యక్తులను ఎలా చంపాలి … గొంతు, కడుపులు ఎలా చీరేయాలన్నది నేర్పిస్తారు” అని కూడా ఎన్‌ఐఎ పేర్కొంది.

ఇదిలావుండగా నిందితులు అబ్దుల్ ఖాదర్, అబ్దుల్ షేక్, ఇలియాస్ అహ్మద్, అబ్దుల్ సలీమ్, షేక్, షాదుల్లా, ఫిరోజ్ ఖాన్, మొహమ్మద్ ఉస్మాన్ అలియాస్ ఉస్మాన్, సయ్యద్ యాహియ సమీర్, షేక్ ఇమ్రాన్, ముహమ్మద్ అబ్దుల్ ముబీన్, మొహమ్మద్ ఇర్ఫాన్‌లపై యుఎ(పి)యాక్ట్ కు చెందిన సెక్షన్స్ 17,18,18ఎ,18బి, ఐపిసి సెక్షన్‌లు 120బి, 153(ఎ) కింద ఛార్జీషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం మరింత పరిశోధన కొనసాగుతోంది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News