Thursday, April 25, 2024

కదులుతున్న ‘ఉగ్ర’ డొంకలు

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

దర్యాప్తునకు దారి చూపించిన నిజామాబాద్ పోలీసులు ఖాదర్ పెన్‌డ్రైవ్
డీకోడ్ తర్వాతే బ్రేక్ అయిన పిఎఫ్‌ఐ నెట్‌వర్క్ వివిధ రాష్ట్రాల్లో 106
మందిని అరెస్టు చేసిన దర్యాప్తు బృందాలు అత్యధికంగా కేరళలో
అరెస్టులు ఎపిలో నలుగురు, తెలంగాణలో ఒకరు

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: శిక్షణ సేవ ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు ఉతమిచేవిధంగా పాపులర్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఎ) సా గిస్తున్న కార్యకలాపాల తీగ నగరంలో లాగి తే దేశవ్యాప్తంగా ఆ సంస్థ కా ర్యకలాపాల డొంగ కదులుతోంది. ఆదివారం నిజామాబాద్‌లో విస్తృంగా సోదాలు జరిపిన తర్వాత ఎన్‌ఐఎ బృందాలు శుక్రవారం దేశవ్యాప్తంగా విరుచుకుపడ్డా యి. దాదాపు 12 రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ స్థావరాలపై దాడు లు నిర్వహించింది. 170కి పైగా బృందాలతో 200 మంది సిబ్బంది గురువారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మెరుపు దాడులు జరిపారు. ఆయా రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్న 106మంది ర్ఝైస్టు చేశారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్, మాలపల్లి, పూలాంగ్, హౌ సింగ్ బోర్డు ప్రాంతాలలో 23 బృందాలు జరిపిన సోదాల్లో పెద్దఎత్తున ల్యాప్‌ట్యాంప్‌లు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ము ఖ్యంగా పిఎఫ్‌ఐ ప్రధాన నిర్వాహకులుగా ఉన్న ఖాదర్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో ఉన్న సమాచారాన్ని రెండు రోజుల తర్వాత ఢీకొడ్ చేసిన ఎన్‌ఐఎ అధికారులు అందులో ఉన్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా దాడులకు కేంద్ర హోంశాఖ నుంచి అత్యవసర అనుమతులు పొందినట్లు సమాచారం.

ఇం దులో భాగంగానే గురువారం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులు జరిపి భారతదేశంలో పిఎఫ్‌ఐ కార్యకలాపాలను విస్తరుస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కరాటే శిక్షణ, సామాజిక సేవ కార్యక్రమాల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్న పిఎఫ్‌ఐ ఉనికిని మొదట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పోలీసులు అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్న పిఎఫ్‌ఎ అడ్డాపై దాడి చేసి ఖాదర్‌తోత పాటు మరో ఇద్దరు యువకులను ఆరవ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు తదుపరి దర్యాప్తును జాతీయ దర్యాప్తు (ఎన్‌ఐఎ) యధాలాపంగా మొదలు పెట్టింది. మొదట ఆశామాషీ కేసుగానే ఓ అధికారి కేసు పరిశీలించి ఆ సంస్థ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. అంతేస్థాయిలో కీలకమైన సమాచారమే బయటకు రావడంతో వారు ఎస్పీ స్థాయి అధికారి రంగంలోకి దిగారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు తీరతెన్నులా మారిపోయింది. జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఖాదర్‌ను కోర్టు అనుమతితో పదిరోజుల పాటు విచారించారు.

ఖాదర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 40చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. ఖాదర్ ఇచ్చిన కీలకమైన సమాచారంతోనే పిఎఫ్‌ఐ అసలు గుట్టును రట్టు చేశారు. దేశ వ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న నెట్‌వర్క్‌ను ఎట్టకేలకు బ్రేకు చేశారు. ఖాదర్ ఇంట్లో పెన్ను డ్రైవ్‌లో ఉన్న సమాచారం ఢీకొడ్ చేయడం ఎన్‌ఐఎ అధికారులకు క్లిష్టంగా మారినప్పటికి రెండు రోజులు ఆలస్యంగానైన సమాచారాన్ని రాబట్టి దేశ వ్యాప్తంగా ఆ సంస్థలో కీలక బాధ్యతలో ఉన్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

చాంద్రాయణగుట్టలోని పిఎఫ్‌ఐ కార్యాలయం సీజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో గురువారం సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఎ చాంద్రాయణగుట్టలోని పిఎఫ్‌ఐ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇక్కడినుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోదాల అనంతరం పిఎఫ్‌ఐ కార్యాలయాన్ని ఎన్‌ఐఎ అధికారులు సీజ్ చేశారు. గేట్‌కు నోటీసులు అందించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా పిఎఫ్‌ఐ ప్రతినిధులుకు ఎన్‌ఐఎ స్పష్టం చేసింది. వనస్థలిపురంలోని ఆటో నగర్‌లోని ఓ ఇంట్లో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా సమాచారం. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లోని పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఏపీ విషయానికి వస్తే.. కర్నూలు, గుంటూరులలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించిందని సమాచారం.

ఏపీలో నలుగురిని, తెలంగాణలో ఒకరిని అరెస్ట్ చేశాం: ఎన్‌ఐఎ

నలుగురిని ఏపీలో, ఒకరిని తెలంగాణలో అరెస్ట్ చేశామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. పీఎఫ్‌ఐ కేసులో దేశవ్యాప్తంగా ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ అధికారులు తనిఖీలు చేశారు. 5 కేసుల్లో గురువారం 45 మందిని అరెస్ట్ చేశామని ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. ఢిల్లీలో నమోదు చేసిన 3 కేసుల్లో 29 మంది అరెస్ట్ చేశామని, కొచ్చిలో నమోదు చేసిన కేసులో 11 మందిని అరెస్ట్ చేశామని ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. కర్ణాటక ,కేరళ, యూపీ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు జరిపారు.

దాడులకు వ్యతిరేకంగా కేరళలో పిఎఫ్‌ఐ నిరసనలు

తమ సంస్థల కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ కేరళలో పలు చోట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకర్తలు గురువారం ధర్నాలకు దిగారు. నియా, ఇతర కేంద్రీయ సంస్థలు అకారణంగా తమను తీవ్ర కేసులలోకి నెట్టేందుకు యత్నిస్తున్నాయని సంస్థ ఆరోపించింది. గురువారం తెల్లవారుజామున సోదాలు నిర్వహిస్తున్నారనే వార్తలు వెలువడటంతో కేరళలో తిరువనంతపురం ఇతర చోట్ల పిఎఫ్‌ఐ కార్యకర్తలు గుమికూడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. దర్యాప్తు సంస్థల వైఖరిని తప్పుపట్టారు. కొల్లామ్, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్‌లలో కూడా నిరసనలు చేపట్టారని విమర్శించారు. పిఎఫ్‌ఐ కార్యవర్గ సభ్యులు 14 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు ఉన్నారు. ఇప్పుడు కస్టడీలో ఉన్న వారిలో పిఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు ఒఎంఎ సలామ్, కేరళ విభాగం నేత సిపి మెహమ్మద్ బషీర్ , జాతీయ కార్యదర్శి నసరుద్దిన్ ఎలమారం ఇతరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News