Home తాజా వార్తలు గల్లా అశోక్ కు జోడీగా ఇస్మార్ట్ పోరి!

గల్లా అశోక్ కు జోడీగా ఇస్మార్ట్ పోరి!

 

సూపర్‌ స్టార్ మహేష్ బాబు భావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాని దేవదాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈనెల 10న రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, గల్లా అశోక్ కు జోడీగా ఇస్మార్ట్ పోరీ, అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుందని తెలిసింది. అయితే అశోక్ డెబ్యూ హీరో కావడంతో నిధి ఈ ప్రాజెక్ట్‌కి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి ఈ సినిమాలో నటింపచేసే దిశగా చర్చలు సాగుతున్నాయట. ఇటీవల హీరో రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మంచి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నిధి అగర్వాల్‌కు ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.

Nidhi Agarwal Opposite to Ashok Galla