Saturday, April 20, 2024

17736 వద్ద ముగిసిన నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

sensex

ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్ 212.88 పాయింట్లు లేక 0.36 శాతం పెరిగి 59756.84 వద్ద, నిఫ్టీ 80.60 పాయింట్లు లేక 0.46 శాతం పెరిగి 17736.95 వద్ద ముగిసింది. 1770 షేర్లు లాభపడగా, 1548 షేర్లు నష్టపోయాయి, 125 షేర్లు ఎలాంటి మార్పుకు లోనవ్వలేదు(యథాతథంగా ముగిసాయి). ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరి రోజయిన నేడు (గురువారం) ట్రేడింగ్ చాలా హెచ్చుతగ్గులకు (వొలాటిలిటీ) గురయింది. మెటల్స్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాకుల్లో ర్యాలీ (2 నుంచి 3 శాతం మేరకు) బుల్లిష్ సెంటిమెంట్‌ను నిలబెట్టింది.

టాప్ గెయినర్స్‌లో జెఎస్‌డబ్లు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటాస్టీల్, అదానీ పోర్ట్, పవర్ గ్రిడ్ ఉండగా, నష్టపోయినవాటిలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా ఉన్నాయి. ఇక బిఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున పెరిగాయి. పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ రెండో త్రైమాసికంలో 11.7 శాతం వృద్ధిని కనబరుస్తూ రూ. 266.6కోట్లు నికర లాభాన్ని పోస్ట్ చేసింది. ఇక నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కమ్ 36.2 శాతం పెరిగి రూ. 633.7 కోట్లు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో పోస్ట్ చేసింది.
టెక్నికల్‌గా చూసినప్పుడు నిఫ్టీ 17800 వద్ద రెసిస్టెన్స్‌ను గత మూడు సెషన్స్‌లో ఎదుర్కొంది. ఒకవేళ నిఫ్టీ 17800ను బ్రేక్ చేస్తే 17900 నుంచి 18000 మధ్య కదలాడవచ్చు. ఒకవేళ 17625 కిందకి వెళితే 17500 నుంచి 17450కు పడిపోవచ్చు.
రూపాయి విలువ డాలరుతో పోల్చినప్పుడు 24పైసలు పెరిగి 82.49 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News