Friday, March 29, 2024

ఉగ్ర సంస్థ చెర నుంచి బయటపడ్డ నైజీరియా విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

Nigerian students released by Boko Haram

 

కట్సీనా: వారం రోజుల క్రితం అపహరణకు గురైన నైజీరియా విద్యార్థుల్ని ఉగ్రవాద సంస్థ బోకో హారం గురువారం విడుదల చేసింది. ఉగ్ర సంస్థ నుంచి విముక్తి పొందిన 344మంది శుక్రవారం తనను కలిశారని కట్సీనా రాష్ట్ర గవర్నర్ అమీన్‌బెల్లో మసారీ తెలిపారు. కంకరా అనే ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ విద్యార్థులను ఉగ్రవాదులు అపహరించారు. కిడ్నాప్ సమయంలో మొత్తం 800మంది విద్యార్థులుండగా, మిగతావారు అక్కడి నుంచి పారిపోగా 330మందికిపైగా అపహరణకు గురైనట్టు తొలుత భావించారు. ఇస్లాంకు వ్యతిరేకమైన పాశ్చాత్య విద్యను ఆ పాఠశాలలో బోధిస్తున్నారన్న కారణంతోనే కిడ్నాప్‌నకు పాల్పడినట్టు ఉగ్రసంస్థ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News