Wednesday, April 17, 2024

రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

night curfew extension in telangana

పెళ్లిళ్లకు 100 మంది
దహన సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతి
రాజకీయ పార్టీల సమావేశాలు, విందులు, వినోదాలు, మతపరమైన సదస్సులు, క్రీడలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం
రాష్ట్రంలో రాత్రి కర్ఫూ మరో వారం పొడిగింపు

హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న రాత్రి కర్ఫూ శనివారంతో పూర్తి కానుండడంతో ప్రభుత్వం మళ్లీ వారం రోజుల పాటు పొడిగించింది. కర్పూ ఈనెల 15వ తేదీ ఉదయం 5గంటల వరకు కొనసాగుతుందని శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్ప్యూ సందర్భంగా రాత్రి 8 గంటకు వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర సంస్థలు మూసివేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, కమిషనర్స్, సూపరింటెండ్ ఆఫ్‌పోలీసులకు అధికారాలను అప్పగించారు. ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో మరికొన్ని ఆంక్షలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వివాహాలు, ఇతర ఫంక్షన్‌ల నిర్వహణపై ఆంక్షలు విధించారు.

ఈ వివాహ వేడుకల్లో 100కి మాత్రమే, అదీ కొవిడ్ నిబంధనలు పాటించేలా అనుమతిస్తారు. అలాగే శవాల ఊరేగింపులు, దహన సంస్కారాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతిస్తారు. కాగా రాజకీయ పార్టీల సమావేశాలు, స్పోర్ట్స్, ఎంటర్ టెయిన్‌మెంట్, విద్య, మతపరమైన, సాంసృతిక పరమైన సమావేశాలు, ర్యాలీలను వంటి కార్యక్రమాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు కొవిడ్ మార్గదర్శకాలు, భౌతికదూరాన్ని పాటించడంతో పాటు మాస్కులు విధిగా ధరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పిలను ఆదేశించారు.

night curfew extension in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News