Saturday, March 25, 2023

రాత్రంతా ఆరుబయటే కంది రైతుల జాగారాలు

- Advertisement -

peak

*ఆందోళనతో బిక్కుబిక్కు
మంటూ కూర్చున్న కంది రైతులు

మన తెలంగాణ/మర్పల్లి: మర్పల్లిలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించక పోవడం తో కంది రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ కొనుగోలు కేం ద్రానికి మర్పల్లి మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి రైతులు కందులను తీసుకువస్తున్నారు.  రెండు రోజుల క్రితం  మండలాలకు చెందిన కొందరు రైతులకు కొనుగోలు కేంద్రం అధికారులు 21న కొంత మంది రైతులకు, 22న మరికొంత మంది రైతులకు కం దులను తీసుకురావాలని పేపర్‌మీద తేదీలను రాసివ్వడంతో వారు కందులను తీసుకురాగా కందులను తీసుకోవలసిన సిబ్బంది అసలు మీకు  కందులను తీసుకుని ఎవ్వరు రమ్మన్నారంటూ  తమపై ఆ గ్రహం వ్యక్తం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత బతిమాలినా  కూడా కందులను తీసుకోవడం లేదని వారు విచారం వ్యక్తం చే శారు. దీంతో తాము రెండు రోజులుగా మర్పల్లి గోదాం ఎదుట  ఆరుబయటనే కందులను సి.సి రోడ్డుపై వేసుకోని రెండు రో జులుగా  రాత్రంతా జాగారం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. అధికారులు తీసుకురమ్మంటేనే తాము కందులను తీసుకోచ్చామని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి కందులను కొనుగోళ్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News