Home రాష్ట్ర వార్తలు బీబీనగర్ నిమ్స్‌లో 1160 కొలువులు

బీబీనగర్ నిమ్స్‌లో 1160 కొలువులు

meetingభర్తీకి ప్రభుత్వం ఆమోదం, అన్ని స్పెషాలిటీస్‌తో పిజి ఇనిస్టిట్యూషన్
డాక్టర్లకు ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు, ఒప్పంద కార్మికుల వేతనాల పెంపు, ఎర్రమంజిల్ నిమ్స్‌లో నెఫ్రో-యూరాలజీ సేవలు

హైదరాబాద్: తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయన్న ముఖ్యమంత్రి కెసి ఆర్ మాట నిలబెట్టుకోనున్నా రని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ ఆదే శాల మేరకు బీబీనగర్ నిమ్స్‌లో 1,160 పోస్టులను భర్తీ చేయా లని పాలకమండలి నిర్ణయిం చిందని ఆయన తెలిపారు. మంత్రి డాక్టర్ సి. లకా్ష్మరెడ్డి నేతృత్వంలో నిమ్స్ పాలకమండలి సమావేశమయింది. కొత్తగా బీబీనగర్‌లో నిర్మిస్తు న్న నిమ్స్ వైద్యశాలలో అన్ని రకాల టీచింగ్ పోస్టు లతో కలిపి మొత్తం 1,160 పోస్టులను భర్తీ చేయ నున్నట్టు ఆయన తెలిపారు. మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగానికి అవసరమయ్యే ఉద్యోగుల భర్తీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి, సిఎం ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్టు తెలి పారు. ఇకపై నిమ్స్ టీచింగ్ డాక్టర్స్ నియామకా లకు ఇప్పుడు అమలులో ఉన్న 4టైర్ సిస్టం ప్రొఫె సర్, అదనపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే నాలుగు అంచెల పద్ధతిని పాటించాలని నిర్ణయించినట్టు తెలిపారు. త్వరలో బీబీనగర్ నిమ్స్‌లో పూర్తిస్థాయి సేవలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసు కోవాలని కూడా నిర్ణయించినట్టు తెలిపారు. బీబీనగర్ నిమ్స్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయా లని మంత్రి ఆదేశించారు. అలాగే బీబీనగర్ నిమ్స్‌ని 650 పడకల స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీ ర్చిదిద్దుతామన్నారు. ఎర్రమంజిల్ నిమ్స్‌లో నెప్రో-యురాలజి టవర్స్‌ను ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు. రూ.30కోట్లతో పరికరాల కొ నుగోలు, ఆధునీకరణకు అనుమతి లభించింద న్నారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆర్థిక కార్య దర్శి నవీన్ మిట్టల్, నిమ్స్ వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ మనోహర్, డీన్ సుభాష్, ఎగ్జిక్యూటీవ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ తధితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో కొలువులకు గ్రీన్ సిగ్నల్
వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ రిమ్స్ (రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కి కూడా కొత్తహంగులు సమకూర్చనున్న తెలంగా ణ ప్రభుత్వం. ఆధునీకరణతో పాటు,రి మ్స్‌లో అన్ని శాఖల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించిం దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం రిమ్స్ పాలక మండలి సమావేశం జరిగిందని ఆయన తెలిపారు.