Home జనగామ చెల్పూర్‌లో కెసిఆర్ విగ్రహావిష్కరణ

చెల్పూర్‌లో కెసిఆర్ విగ్రహావిష్కరణ

Nine-feet tall statue of KCR unveiled at chilpur village

 

రూ.ఐదులక్షల వ్యయంతో తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ రాజ్‌కుమార్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమున విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపిపి సరిత

జనగాం: జిల్లాలోని చెల్పూర్ పల్లె ప్రకృతి వనం బర్రెంతల చెరువు కట్టపై సర్పంచ్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపిపి సరితతో కలిసి సర్పంచ్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొమ్మిది అడుగుల ఎత్తులో నిర్మాణమైన కెసిఆర్ విగ్రహాన్ని సర్పంచ్ స్వతంగా రూ.ఐదు లక్షలు వెచ్చించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సిఎం కెసిఆర్ పరిపాలన రామరాజ్యాన్ని తలపిస్తుందని అందుకు తాను భక్తునిగా, కార్యకర్తగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండగా చెల్పూర్‌లో మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన కెసిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా మంత్రులు, ఎంఎల్‌ఎలకు తెలియకుండా తన గ్రామం వరకే విగ్రహావిష్కరణ చేసుకోవడం సంచలనం రేకెత్తించింది.

Nine-feet tall statue of KCR unveiled at chilpur village