Friday, April 19, 2024

తొమ్మిదికి చేరిన కరోనా మృతులు

- Advertisement -
- Advertisement -

Corona virus

 

హైదరాబాద్: కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోల్‌కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 415కి చేరింది. అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. కిట్ల తయారీకి ఐసిఎంఆర్ అనుమతి ఉంటే చాలని పేర్కొంది. 15 వేల కేంద్రాల్లో కరోనా టెస్టులు చేస్తున్నామని, ప్రైవేటు ల్యాబ్స్‌కు గైడ్‌లైన్స్ ఇచ్చిందని, కరోనా వ్యాధికి యాంటీ మలేరియా వ్యాక్సిన్ టెస్ట్ సరిపోతుందని ఐసిఎంఆర్ ప్రకటించింది. యాంటి మలేరియా వ్యాక్సిన్, హైడ్రో క్లోరోక్విన్ వ్యాక్సిన్ రెకమండ్ చేసింది. యాంటీ మలేరియా వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చిందని ప్రకటించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వ్యక్తులకు యాంటి  మలేరియా వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News