Home అంతర్జాతీయ వార్తలు ఉగ్రవాదుల దాడిలో తొమ్మిది మంది మృతి

ఉగ్రవాదుల దాడిలో తొమ్మిది మంది మృతి

Terrorist Attackపాకిస్తాన్ : డేరాఇస్మాయిల్‌ఖాన్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఓ ఆస్పత్రి బయట ప్రజలు రద్దీగా ఉన్న  ప్రాంతంలో ఉగ్రవాదులు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో  ఆరుగురు పోలీసులతో సహా 9 మంది ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో  40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడులు తామే చేసినట్టు తెహ్రక్ – తాలిబన్ పాక్ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో డేరాఇస్మాయిల్‌ఖాన్ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Nine People Dead In Terrorist Attack At Pak