Wednesday, April 24, 2024

దారి మృత్యువుకు 9 మంది బలి

- Advertisement -
- Advertisement -

 road accident

 

13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు

n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్‌టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
n నార్సింగి మండలం శివారులో మరో ప్రమాదంలో ముగ్గురు మృతి,
ఇద్దరికి తీవ్ర గాయలు

/కొల్చారం/చేగుంట : మెదక్ జిల్లాలో సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడుపాయల వనదుర్గాభవాని మాత దర్శనం కోసం కుటుంబ సమేతంగా డిసిఎంలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరి 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇదిలా ఉండగా నార్సింగి మండల శివారులో కునాలదాబా వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మొదటి సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చెందిన 20 మంది డిసిఎం వ్యానులో ఏడుపాయలకు వెళ్తున్న క్రమంలో మెదక్ నుంచి పటాన్‌చెరువుకు వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢీకొంది.

దీంతో డిసిఎం వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మృతుల్లో చాపల మాధవి(40), మన్నె మంజుల(40), నీరుడి దుర్గమ్మ(45),గూడాల మాణమ్మ(55), గోడుగు రజిత(45), దుగ్యాల్ మాధురి(9) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన అనసూయ, యాదమ్మ, ఈశ్వరమ్మ, దిగ్వాల్ చందు, రామేశ్వరం లక్ష్మి, ఉడుత సువర్ణ, కమ్మరి గౌరి, జానకి, గొడుగు లక్ష్మి, డిసిఎం డ్రైవర్ జమాలొద్దీన్‌లను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగిందని డిఎస్‌పి కృష్ణమూర్తి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఘటనా స్థలిని మెదక్ అడిషనల్ ఎస్‌పి నాగరాజు సందర్శించారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. రెండవ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, దామన్నపేట గ్రామానికి వెళుతున్న ఓమ్ని నార్సింగి శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో గంభీరావుపేటకు చెందిన కృష్ణ, కృష్ణయ్య, అంజిలు ఘటనాస్థలిలోనే చనిపోయారు. కావ్య, అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.

 

Nine people died in road accident
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News