Home తాజా వార్తలు పరిసరాల పరిశుభ్రతతోనే పరిపూర్ణ ఆరోగ్యం : నిరంజన్ రెడ్డి

పరిసరాల పరిశుభ్రతతోనే పరిపూర్ణ ఆరోగ్యం : నిరంజన్ రెడ్డి

Swachh Wanaparthy Programవనపర్తి : పరిసరాల పరిశుభ్రతతోనే పరిపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వనపర్తి మున్సిపాలిటీలో ‘స్వచ్ఛ వనపర్తి’ కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే అంటురోగాలు ప్రబలవని ఆయన ప్రజలకు సూచించారు. వచ్చే 15 రోజుల్లో వనపర్తి రూపురేఖలు మారిపోవాలని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛ వనపర్తి కార్యక్రమంలో తాను ఐదు రోజుల పాటు శ్రమదానం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా శ్రమదానం ద్వారా వనపర్తిని బాగు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Niranjan Reddy Attended To Swachh Wanaparthy Program