Home తాజా వార్తలు బిజినేపల్లిలో సబ్సిడీ వేరుశనగ విత్తనం పంపిణీ: నిరంజన్ రెడ్డి

బిజినేపల్లిలో సబ్సిడీ వేరుశనగ విత్తనం పంపిణీ: నిరంజన్ రెడ్డి

Niranjan Reddy

 

హైదరాబాద్: కరువు, కాటకాలతో వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా ముద్ర పడిన కందనూలు దశ మారుతోందని వ్యవసాయశాక మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో రైతులకు సబ్సిడి వేరు శనగ విత్తనాల కేంద్రాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… రైతులకు సీజన్ కంటే ముందే ఈ ఏడాది పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. వాతావరణం కు అనుగునంగానే దసరా తరువాత వేరు శనగ పంటను వేస్తారు. కానీ ఈ ఏడాది ప్రతి గ్రామంలో నీరు, కరేంట్ ఉంది. రైతులకు సరిపడు విత్తనాలు కోసం ప్రభుత్వం ట్రేడర్ల ద్వారా టెంబర్ల పిలిచి వేరు శనగ విత్తనాలు కొనుగోలు చేసింది. పంటలలో ప్రధాన పంటగా రాబోయ్య రోజులో వేరు శనగా పంట ముఖ్యమైన పంటగా నిలుస్తుంది. వేరు శనగలో అనేక ఉత్పతులు లాభదయకంగా ఉన్నాయి.

భవిష్యత్‌లో వేరు శనగ పంటలను ఎక్కువగా ప్రోత్సహం కలుగుతుందని అన్నారు. 30 డిగ్రీల వాతావరణం ఉంటేనే అధికంగా పంట పండుతుందని, పగలు రాత్రి సమాన ఉష్ణోగ్రత ఉండాలని దానిని శాస్త్రవేత్తల సూచనాల మేరకే పంటలు సాగు చేయాలని తెలిపారు. అనంతరం ఎంపి రాములు మాట్లాడుతూ… కందనూలు ప్రాంతం పచ్చ బడుతుండటంతో గ్రామాలను విడిచి వెళ్లిన వారు తిరుగు ముఖం పట్టాయన్నారు. నియోజకవర్గంలోనే పెద్ద మండలం బిజినేపల్లిలోని రైతులు ఎక్కవగా వ్యవసాయంపై ఆదారపడిన వారు ఉన్నారు. ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పధకాలు అమలు రైతులకు అందించాలని అన్నారు.

అభివృద్ధి దశగా కందనూల్ పరుగులు పెడుతుందని సబ్సిడి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం వేరు శనగ క్వింటాళ్లుకు 9వేల మద్దతు పలికిందని రైతులు కేవలం 4వేలు చెల్లిస్తే 5వేలు సబ్సిడి ఇస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోస పోకుడాదనన్నారు. అనంతరం ఎంఎల్ఎ మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో కాలువల ద్వారా నీరు చెరువులకు నీరు చెరిందని,ఖరీఫ్ పంటల సాగు మంచిగానే ఉందని బిజినేపల్లిలో ఎన్నికల ముందు మార్కోండయ మినీ రిజార్వార్ పూర్తి చేస్తే ఇక్కడి రైతులకు నీటి సమస్యలు తీరుతాయి. ఈ కార్యక్రమంలో జడ్పిచైర్మెన్ పద్మావతి, ఎంపిపి శ్రీనివాసు గౌడ్, జడ్‌పిటిసి హరిచరణ్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ వెంకట్‌స్వామి, ఎఒ, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Niranjan Reddy distributes subsidized peanut seed