Home తాజా వార్తలు 30 రోజుల పంచాయతీ కార్యాచరణ ప్రణాళిక

30 రోజుల పంచాయతీ కార్యాచరణ ప్రణాళిక

Niranjan Reddy

 

హైదరాబాద్: గోపాలపేట్, బుద్ధారం గ్రామాల్లో 30 రోజుల పంచాయతీ కార్యాచరణ ప్రణాళికను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు, గ్రామాలకు కావాల్సిన సమస్యలు తీరాలన్నదే సిఎం కెసిఆర్ ఆలోచన అని అన్నారు. ప్రజలకు ఏది అవసరమో వారి ద్వారా తెలుసుకోవాలన్నదే ఈ కార్యాక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్యం, సాగు, తాగునీరు వంటి అంశాలను అభివృద్ధి చేస్తూనే ఉంటుందని, అందుకు ప్రభుత్వ పనులతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నదే సిఎం కెసిఆర్ తపన అని ఆయన వెల్లడించారు. గ్రామాలలో వీధి, వీధినా పారిశుద్యం తీరు మెరుగుపడాలంటే ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యలు కావాలని ఆయన పేర్కొన్నారు.

పారిశుద్య కార్మికుల వేతనాలను ప్రభుత్వం రూ.8500 లకు పెంచింది. గ్రామస్తులంతా సమిష్టిగా గ్రామంలో పాత బావుల పూడ్చివేత, కరెంటు స్తంభాలు సరిచేయడం, వేలాడే తీగలను సరిచేసుకోవాలని, అవసరమైన వాటికి ప్రతిపాదనలు తయారు చేసుకుని ప్రభుత్వానికి పంపించాలని నిరంజన్ రెడ్డి సూచించారు. పారిశుధ్య లోపంతో గ్రామాలలో ప్రజలు అనారోగ్యం పాలవుతారని, హరితహారంతో అందరూ భాగస్వాములై చెట్లు నాటి అవి పెరిగేలా చూడాలని ఆయన చెప్పారు. భావితరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందిద్దామని, అంత్యంత పచ్చదనం ఉన్న ప్రాంతం, పంటలు పండే ప్రాంతం తెలంగాణ అని చెప్పుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Niranjan Reddy has begin 30 day Panchayat Action Plan