Home తాజా వార్తలు గుడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గుడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా :  గుడిపల్లి రిజర్వాయర్ ప్యాకేజీ 29,30 నుంచి సాగు నీటిని ఆదివారం మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  విడుదల చేశారు. ప్యాకేజీ 29 వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన గేట్లు ఎత్తి నాగర్ కర్నూల్ నియోజకవర్గనికి సాగు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా ప్యాకేజీ 30 నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి మంత్రి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం వందేళ్ల ముందుచూపుతో కెసిఆర్ పాలన చేస్తున్నారని మంత్రి కొనియాడారు.  హరిత హారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.