Home తాజా వార్తలు బంగారు తెలంగాణ దిశగా అడుగులు: మంత్రి నిరంజన్ రెడ్డి

బంగారు తెలంగాణ దిశగా అడుగులు: మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Singireddy Niranjan Reddy

 

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సాగు బలపడితేనే ఆదాయం పెరుగుతుందని, రైతుబంధు, రైతుబీమా అమలు చేసామని ఆయన తెలిపారు. ఐదేళ్లలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపామని,  రాష్ట్రంలో సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సూచించారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు విస్మరణకు గురయ్యాయి, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. వ్యవసాయంతో బతకగలమనే ఆత్మవిశ్వాసాన్ని యువతలో కలిగించే ప్రణాళికలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని, రైతుబంధు సాయాన్ని రూ. 10 వేలకు పెంచే హామీని అమల్లోకి తెచ్చినమని నిరంజన్ రెడ్డి తెలిపారు.

niranjan reddy speech on agriculture development