Wednesday, March 29, 2023

నృసింహుడు సర్వాంతర్యామి

- Advertisement -

panthurlu

*నృసింహుని అనుగ్రహం వల్లే ధర్మపురి క్షేత్ర దర్శన భాగ్యం కలిగింది
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహదారు చాగంటి కోటెశ్వర్‌రావు

మనతెలంగాణ/ధర్మపురి: విష్ణుభగవాణుడు నృసింహుని అవతారంలో సర్వంతర్యామిగా ఉండి భక్తుల కోరికలు తీర్చుతున్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు, ప్రముఖ ప్రవచకులు చాగంటి కోటేశ్వర్‌రావు అన్నారు.ఆయన శనివారం శ్రీలక్ష్మినరసింహస్వామి ఆ లయ ప్రాంగణంలోని శేషప్ప కళా వేదకిపై ప్రవచనం చేశారు. ఈ సందర్బంగా కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ మానవులు ఎంతో పుణ్యం చేసుకు ంటేగాని ధర్మపురి నృసింహుని దర్శన బాగ్యం కలగదన్నారు. ధర్మపురి క్షేత్రంలో పురాతన కాలం నుంచి ధర్మం విలసిల్లుతూ, శేషప్పకవిలాంటి ఎంతో మంది మహానుబావులకు జన్మనివ్వడం వల్లనే నృసింహుడు ఇ క్కడ వెలశాడన్నారు. భక్తుల కోరికలు తీర్చేందుకే విష్ణుమూర్తి నృసింహుని అవతారంలో వెలశాడన్నారు.ఉగ్రనరసింహుడు కోపగ్రస్తుడు కా దని, హిరణ్యకశపుని మూర్కత్వం వల్లనే నృసింహుడు ఉగ్రరూపం దా ల్చడన్నారు. స్వామి వారి భక్తుడైన ప్రహ్లదుడి మాట నిలబెట్టడానికే నృ సింహుడు విశ్వమంత వ్యాపించాడన్నారు. భక్తి అంటే నెలకోసారి ఉపవాసదీక్షలు చేయడం కాదని, భక్త ప్రహ్లదునిలాగా శరీరంలోని అణువనునా భక్తి కలిగి ఉండాలన్నారు. అదేవిదంగా ప్రహాదుడు సర్వ ప్రాణులను మిత్రబావంతో చూడడం వల్లనే నృసింహుని అనుగ్రహం పొందాడన్నారు. శేషప్ప శతక పద్యాలంటే తనకెంతో వ్యామోహమన్నారు. తల్గి గర్భం నుండి ధనము దేడెవ్వడు, వెల్లిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమేకాని, మెఱుగు బంగారంబు మ్రింగబోడు. విత్తమార్జనజేసి విఱ్ఱవీగుటేకాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. పొందుగా మఱుగైన భూమిలోపలబెట్టి, దానధర్మము లేక దాచి దాచి, తుదకు దొ ంగల కిత్తురో, దొరల కవునో అనే పద్యం చెప్పకుండా తన ప్రవచనం జ రగదన్నారు.శేషప్పకవి పేరున ఏర్పాటు చేసిన కళామండపంలో ప్రవచనం చెప్పడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
స్వామి వారి అనుగ్రహంతో మరోసారి ధర్మపురిలో ప్రవచనం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సహ య కమిషనర్ నాయని సుప్రియ, ధర్మకర్తలు జెట్టి రాజన్న, అక్కనపెల్లి సునిల్, మామిడి లింగన్న, మధు మహదేవ్, దోమకొండ తిరుపతి, ము రకి భాగ్యలక్ష్మి, దేవస్తాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News