Home జాతీయ వార్తలు ఉరికంభం ఎక్కనున్న ‘నిర్భయ’ నేరస్థులు

ఉరికంభం ఎక్కనున్న ‘నిర్భయ’ నేరస్థులు

 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం సంఘటనలోని నలుగురు దోషులకు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. 2012 డిసెంబర్ 12న దేశరాజధానిలో నిర్భయపై అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారానికి పాల్పడిన నిందితులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు ఢిల్లీ హైకోర్టు, ప్రత్యేక కోర్టులు మరణశిక్ష విధించాయి. గత ఏడాది జులై 9న సుప్రీంకోర్టు కూడా దోషులకు మరణిశిక్షను ధృవీకరించింది. ఈ నలుగురికి మరణశిక్షను ఖరారు చేస్తూ తీహార్ జైలు సూపరింటెండెంట్ అక్టోబర్ 29న నేరస్థులు తరఫు న్యాయవాదులకు నోటీసులు అందచేశారు. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని అర్థిస్తూ ఈ నలుగురు నేరస్థులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు దరఖాస్తు చేసుకోవడం మినహా మరో మార్గాంతరం లేదు. దానికి కూడా మరో వారం రోజులు మాత్రమే వ్యవధి ఉన్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు. లేని పక్షంలో ఈ నలుగురికి ఉరిశిక్షను అమలుచేయవలసి ఉంటుంది.

 

Nirbhaya convicts asked to file mercy petition before President, The four convicts were asked to file mercy petition within 7 days