Thursday, April 18, 2024

ముంబయి పోలీస్ స్టేషన్లలో నిర్భయ స్క్వాడ్

- Advertisement -
- Advertisement -

Nirbhaya Squad at Mumbai Police Stations

 

ముంబయి: సకినాక బలత్కారం, హత్య కేసు నేపథ్యంలో ముంబయి ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళల రక్షణ కోసం ‘నిర్భయ స్క్వాడ్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాష్ట్ర డిజిపి, ముంబయి పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో కలిశాక ముంబయి సిటీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మహిళా రక్షణ స్కాడ్ నిరంతరం పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహించనుంది. ఈ  స్క్వాడ్ లో ఓ మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్, కానిస్టేబుల్, డ్రైవర్ ఉంటారు. ఈ స్క్వాడ్ మహిళలు, యువతులు, పిల్లల వేధింపు కేసులను ఆపేందుకు పనిచేస్తాయి.

ముంబయి సిటీ పోలీస్ ‘సక్షమ్’ అనే ఓ ప్రాజెక్ట్‌ను కూడా ‘ఎమ్ పవర్’అనే సంస్థ సహకారంతో ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కింద లైంగిక అత్యాచారానికి గురైనవారు, తగాదాల్లో చిక్కుకున్న బాలలు కోలుకునేందుకు సైకోథెరపీ, కౌన్సెలింగ్ ఇచ్చి వారు త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ప్రతి ఐదు ప్రాంతాల్లో ఓ మహిళా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ స్థాయి మహిళా అధికారిణి నోడల్ ఆఫీసర్‌గా ఉండి నిరయ స్క్వాడ్ ను పర్యవేక్షించనున్నారు. ఈ స్క్వాడ్ బాల గృహాలు,అనాథాశ్రమాలు, హాస్టళ్లు తదితర ప్రదేశాల్లో జరిగే ఏదేనీ అవకతవక పనుల విషయాన్ని నిఘా ఉంచి సేకరించనుంది.

నిర్భయ స్క్వాడ్స్ లోని అధికారులు పాఠశాలలు, కళాశాలలు నిర్వహించే సెమినార్లు,ప్యారెంట్స్ మీటింగ్స్‌కు హాజరవ్వాలని కూడా ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు సహా పలుచోట్ల నిర్భయ ఫిర్యాదు బాక్స్‌లను ఉంచుతారు. ఈ బాక్సుల ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేదానిపై రికార్డును కూడా నిర్వహించాల్సి ఉంటుంది. “సమాజంలోని మహిళలు, బాలలకు ఓ సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశ్యంతో ఈ నిర్భయ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఇంకా లైంగిక నేరాలు చేసేవారి మనస్సుల్లో భయం నెలకొల్పేలా ఉంటుంది” అని ముంబయి పోలీస్ మంగళవారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది. మహిళలను వేధించేవారి కదలికలను గమనించేందుకు ఈ స్క్వాడ్ కు నిగూఢ పెన్-కెమెరాలను కూడా ఇవ్వనున్నారు.ఈ స్క్వాడ్ సభ్యులు తీసే వీడియోలు కేసుల సాక్షాధారాలుగా నిలువనున్నాయి. సాధారణంగా లైంగిక వేధింపు కేసులను ఐపిసి 354డి సెక్షన్ కింద నమోదు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News