Home నిర్మల్ తలమొండెం కేసును చేధించిన నిర్మల్ పోలీసులు

తలమొండెం కేసును చేధించిన నిర్మల్ పోలీసులు

Nirmal police who broke the head torso case

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : నిర్మల్ జిల్లాకేంద్రంలో గత నెలలో సంచలనం సృష్టించిన తల మొండెం వేరు చేసిన కేసును నిర్మల్ పోలీసులు చేదించారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శశిధర్ రాజు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.గత నెల 9వ తేదిన భైంసాలోని బస్టాండ్ ప్రాంతలో గుర్తు తెలియని వ్యక్తి తల లభ్యం  కావడంతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గత అదే సమయంలో 11వ తేదిన ఆదివారం రోజు నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌లోని ఒక ఇంట్లో గుర్తు తెలియని మొండెం లభ్యమైంది.దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.అయితే గుర్తు తెలియని వ్యక్తి తలను సామాజిక మాధ్యమంలో ఉంచడంతో వారి బంధువులు అనంతపురం జిల్లాలోని గుత్తి గ్రామంలోని వారు గుర్తించారు.వెంటనే వారు నిర్మల్ పోలీసులను సంప్రదించగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఉత్తర ప్రదేశ్ వ్యక్తగా గుర్తించారు.బంధువులు చెప్పిన ఆధారాల ప్రకారం ఉత్తన ప్రదేశ్‌లోని బైకాడ్ గ్రామావాసిగా చెప్పారు.దీంతో పోలీసులు నిర్మల్ పట్టణంలో దొరికిన మొండెం రూంలో ఎవరెవరు ఉండేవారి ఆరా తీయగా మృతుని సోదరుడు,మిత్రుడు ముగ్గురు కలిసి వస్త్ర వ్యాపారం చేసేవారని తెలిపారు.

అయితే అన్న కుటుంబ సభ్యుల వివాహం ఉండడంతో ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లిపోయాడు.ఇదేక్రమంలో ఇస్రార్‌కు అక్తర్ రూ.25వేలు,సామాగ్రి,డబ్బులు భాకీపడ్డాడు.ప్రతీ రోజు ఇస్రార్‌కు అక్తర్‌కు డబ్బుల విషయంలో గోడువలు జరిగేవి,అయితే గొడవ పెద్ది కావడంతో వారి మధ్య వాగ్వవాదం చెలరేగి ఇస్రార్‌ను అక్తర్ బాదడంతో ఇస్రార్ అక్కిడకక్కడే మృతి చెందాడు.తనను తప్పించకునేందకు అక్తర్ ఇస్రార్ తలను వేరు చేసి భైంసాలో పారవేసి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే నిర్మల్ పోలీసులు మిర్యాలగూడ పోలీసుల సహయంతో ట్రాక్ చేసి నింధితున్ని  అదుపులోకి తీసుకొని నిర్మల్‌కు తరలించారు.ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నిర్మల్ డిఎస్‌పి మనోహార్‌రెడ్డి,సిఐ జాన్‌దివాకర్,ఎస్సై నర్సారెడ్డి, సిబ్బంది బాబురావు, భోజాగౌడ్,గణేష్, రమేష్,ముదార్‌అలీ, రియాజ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సమావేశంలో ఎఎస్పీ దక్షిణూమూర్తి, డిఎస్‌పి మనోహార్‌రెడ్డి,సిఐ జాన్‌దివాకర్ తదితరులు పాల్గొన్నారు.