Friday, March 29, 2024

నిసర్గ తుపాన్ బీభత్సం…. రెండు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు…

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: మహారాష్ట్రలో నిసర్గ తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. రాయగడ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తుపాను తీరాన్ని తాకింది. మహారాష్ట్ర, గుజరాత్‌లో 110-120 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తుండగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో 43 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తుపాను నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేస్తుండగా మరికొన్ని దారి మళ్లిస్తున్నారు. ముంబయిలో 35 స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా అధికారులు మార్చారు. మహారాష్ట్ర తీర ప్రాంతం నుంచి 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 78 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిసర్గ తుపాను ప్రభావంతో ముంబయిలో ఈదురుగాలులు, వర్షాలు కురుస్తోంది. తీర ప్రాంతాలలో తుపాను బీభత్సానికి ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ముంబయిలో గంటకు 39 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బృహన్ ముంబయిలో 35 చోట్ల తాత్కాలిక నివాస కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ముంబయిలో 10840 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News