Home చిన్న సినిమాలు ‘నిశ్శ‌బ్దం’ ప్రీ టీజ‌ర్ విడుద‌ల‌

‘నిశ్శ‌బ్దం’ ప్రీ టీజ‌ర్ విడుద‌ల‌

Nishabdam Movieహైదరాబాద్ : ప్రముఖ నటి అనుష్క న‌టిస్తున్న కొత్త సినిమా ‘సైలెన్స్‌’. ఈ సినిమా ‘నిశ‌బ్ధం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాకు హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం అమెరికాలో జ‌రుపుకుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో  మాధవన్‌ హీరోగా న‌టిస్తున్నారు.  అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌  తదితరులు కీలక  పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. న‌వంబ‌ర్ 7న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Nishabdam Movie Pre Teaser Release