Home తాజా వార్తలు అక్టోబర్ 2న ఒటిటిలో ‘నిశ్శబ్దం’ విడుదల

అక్టోబర్ 2న ఒటిటిలో ‘నిశ్శబ్దం’ విడుదల

Nishabdam Movie Release In OTT On Oct2ndహైదరాబాద్ : ప్రముఖ నటి అనుష్క, హీరో మాధవన్ జంటగా నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. కరోనా లేకుంటే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం తగ్గకపోవడం, థియేటర్లు తెరుచుకోకపోవడంతో ‘నిశ్శబ్దం’  సినిమాను ఒటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను అక్టోబర్2న ఒటిటిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన పిల్స్ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను టాలీవుడ్ , కోలీవుడ్ లలో విడుదల చేయనున్నారు. మొదటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘నిశ్శబ్దం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒటిటిలో ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.