Home తాజా వార్తలు ‘నిశ్శబ్దం’ టీజర్: అదరగొట్టిన అనుష్క

‘నిశ్శబ్దం’ టీజర్: అదరగొట్టిన అనుష్క

Anushka's Nishabdham

గ్లామర్ చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించిన అనుష్క… లేడీ సూపర్ స్టార్ గా, జేజమ్మ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకొంది. బాహుబలి తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘భాగమతి’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క చాలా రోజులు గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాలో స్వీటీ ఇంతవరకూ చేయనటువంటీ మూగ, చెవిటి పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 8న అనుష్క పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం డాషింగ్ డైరెక్టర్ పూరిగన్నాథ్ ‘నిశ్శబ్ధం’ టీజర్ ని విడుదల చేశారు.

తాజాగా ఈ టీజర్‌లో అనుష్క క్యారెక్టర్‌‌కు సంబంధించిన కథ అంతా చెప్పేసాడు దర్శకుడు హేమంత్ మధుకర్. సినిమా అంతా అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది. టీజర్‌లో అనుష్కకు ఏదో యాక్సిడెంట్ అవ్వడం.. తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి సైగలతో ఏదో చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజుల క్యారెక్టర్స్ ని కూడా రివీల్ చేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. టీజర్ సినిమాపై భారీ అంచనాలే పెంచేసింది. కాగా, వివిధ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. త‌మిళం, మ‌ల‌యాళంలో ఈ టీజర్ ని గౌత‌మ్ మీన‌న్, హిందీలో నీర‌జ్‌పాండే విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’ పేరుతో విడుదల చేస్తుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రిలీజ్ చేయనున్నారు.

Nishabdam movie teaser released