Friday, March 29, 2024

ఓ ఇంటివాడు కాబోతున్న హీరో నితిన్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ఫ్రెండ్ షాలినిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు నితిన్. శనివారం నితిన్, షాలినిల నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుక‌కి  ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా నిశ్చితార్థం ఫోటోలను నితిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు నితిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, నితిన్ గత కొన్ని సంవత్సరాలుగా తన ఫ్రెండ్ షాలినీతో ప్రేమలో ఉన్నాడు. ఓ కామన్‌ ఫ్రెండ్‌ వల్ల పరిచయమైన వీరిద్దరి స్నేహ బంధం ప్రేమగా మాకింది. ఇప్పడు వివాహ బంధంతో ఒకటికాబోతున్నారు. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నితిన్‌, షాలినిల వివాహ వేడుక జర‌గ‌నున్నట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతం నితిన్ నిటించిన భీష్మ చిత్రం ఫిబ్ర‌వ‌రి 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నితన్ సరసన తొలిసారి యంగ్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Nithiin and Shalini Engagement Photos Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News