Home తాజా వార్తలు కామెడీ ట్రాక్ హైలెట్‌గా…

కామెడీ ట్రాక్ హైలెట్‌గా…

Nithiin

 

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో కామెడీ చాలా బాగా వస్తోందని తెలిసింది. ముఖ్యంగా నితిన్, వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ సినిమాలో హైలెట్‌గా ఉంటుందని సమాచారం. మొత్తానికి వెంకీ కుడుముల ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా మలుస్తున్నారు.

ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఓ కీలక పాత్రలో హెబ్బా పటేల్ నటిస్తోంది. కాగా సినిమాలో హెబ్బా పాత్ర బలంగా ఉంటుందని టాక్. మరి ఈ చిత్రంతోనైనా ఆమె ఆశించిన బ్రేక్ దక్కుతుందేమో చూడాలి. నితిన్ కూడా ‘భీష్మ’పై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Nithiin Bheeshma to release on Christmas