Thursday, April 25, 2024

దుబాయ్ లో నితిన్ కొత్త మూవీ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లవర్ బాయ్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఆదివారం దుబాయ్ లో హీరో హీరోయిన్లు నితిన్, నభా నటేషాలపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నితిన్.. సెట్స్ లో నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశాడు.ఇందులో నితిన్ షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్ లో ఆమె పాల్గొననున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి పనిచేస్తున్న మిగతా తారాగణం, టెక్నీషియన్ల వివరాలను వెల్లడించనున్నారు.

Nithiin’s New movie shoot begins in Dubai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News