Thursday, April 25, 2024

వచ్చే వారం నుండి మ్యూజిక్ ఫెస్ట్

- Advertisement -
- Advertisement -

Nithin act in Maestro movie

నితిన్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘మాస్ట్రో’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించి చిత్రీకరణ మొత్తం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెడుతున్న మేకర్స్.. వచ్చే వారం నుండి ‘మాస్ట్రో’ మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్సమెంట్ పోస్టర్‌లో నితిన్ ఒక బీచ్‌లో పియానో వాయిస్తూ కనిపిస్తున్నాడు. ఇంతకుముందు నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ చిత్రానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించిన మహతి స్వరసాగర్ ‘మాస్ట్రో’ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం నితిన్ కెరీర్‌లో వస్తున్న 30వ సినిమా. హిందీ బ్లాక్‌బస్టర్ ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోం ది. మిల్కీబ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ‘మాస్ట్రో’ చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News