Home తాజా వార్తలు పవన్ సినిమాలోసాయిపల్లవి

పవన్ సినిమాలోసాయిపల్లవి

Nithin And Sai Pallavi Act In Pawan Kalyan Movieహైదరాబాద్ : మాలీవుడ్ లో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కొషియమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సన్నామాలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు సినిమా అభిమాన పోలీసు ఈజ్ బ్యాక్ ఇన్ ఏ హై ఓల్టేజ్ రోల్ అంటూ పవన్ కొత్త సినిమా గురించి సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయ్యప్పన్ కొషియమ్‌ను తెలుగులో బిల్లా రంగా అనే పేరుతో రీమేక్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాలీవుడ్ లో పృథ్వీరాజ్ నటించిన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రలో టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్నారని, పవన్ కు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతలు సాయిపల్లవితో చర్చలు జరిపారని, ఈ సినిమాలో నటించేందుకు ఆమె అంగీకరించారని తెలుస్తోంది. ఈ వార్తలపై ఇప్పటివరకు నిర్మాతలు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.