Wednesday, April 24, 2024

‘చెక్’ పోస్ట‌ర్ విడుద‌ల‌

- Advertisement -
- Advertisement -

'Check' poster released

 

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ’చెక్‘. ఈ సినిమాలోని  హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు తన 30వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఆమె ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. ఇందులో చాలా సీరియస్‌గా కనిపిస్తున్న రకుల్ చేతిలో ఓ ఫైల్ పట్టుకొని ఉంది. ఈ లుక్ అభిమానులను ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంతో రూపొందుతున్నది. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు చివరి షెడ్యూల్ పూర్తిచేసి రిలీజ్ డేట్ త్వ‌ర‌లోనే ప్రకటిస్తామని అంటున్నారు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఉరిశిక్ష పడిన ఖైదీ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News