Home తాజా వార్తలు నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు జై కొట్టింది: కెటిఆర్

నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు జై కొట్టింది: కెటిఆర్

KTR హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతున్న చెరువులను, కుంటలను పునరుద్ధరించడానికి కెసిఆర్ సర్కార్ ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించింది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. తాజాగా ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. కొందరు మిషన్ కాకతీయ పథకంపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ నీతి ఆయోగ్ ఈ పథకానికి మద్దతు ఇచ్చిందని కెటిఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర జనవనరుల మంత్రిత్వశాఖ ఇటీవల నీతిఆయోగ్ నివేదికను విడుదల చేస్తూ… మిషన్ కాకతీయ సాగుతున్న తీరుపై ప్రశంసల వర్షం కురిపించిందని కెటిఆర్ అన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22,500 చెరువులు పునరుద్ధరించామనీ, తెలంగాణలో చెరువులపై ఆధారపడి జరిగే సాగు 51.5 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందింస్తూ.. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని పోస్ట్ చేశారు.

Niti Aayog Support Mission Kakatiya