Thursday, April 18, 2024

రాహుల్‌గాంధీతో నితీశ్ సమావేశం

- Advertisement -
- Advertisement -

Nitish's meeting with Rahul Gandhi

న్యూఢిల్లీ: బిహార్ సిఎం నితీశ్‌కుమార్ సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు విపక్షాల ఐక్యత దిశగా చర్చలు జరిపారు. రాహుల్ నివాసంలో వీరు సుమారు గంటసేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్‌తోపాటు బిహార్ జనవనరులశాఖ మంత్రి, జెడియు నేత కూడా పాల్గొన్నారు. బిజెపి కూటమి నుంచి వైదొలిగిన తరువాత రాహుల్‌గాంధీతో నితీశ్‌కుమార్ భేటీ అవడం తొలిసారి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న నితీశ్ విపక్ష నేతలతో భేటీ కానున్నారు. ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్, ఆప్ అధినేత కేజ్రీవాల్ తదితర నేతలతో నేడు సమావేశం కానున్నారు. రాహుల్‌తో సమావేశం అనంతరం నితీశ్ జనతాదళ్ (సెక్యులర్) చీఫ్ హెచ్‌డి కుమారస్వామిని ఆయన నివాసంలో కలిశారు.

రేపు లెఫ్ట్‌పార్టీ నేతలతో నితీశ్ భేటీ

బిహార్ సిఎం నితీశ్ వామపక్ష నేతలతో రేపు భేటీ కానున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ నేత డి రాజాతో మంగళవారం సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనకు ముందు నితీశ్ కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతే లక్షంగా పర్యటించనున్నట్లు తెలిపారు. కాగా 2017లో జెడియు చీఫ్ నితీశ్‌కుమార్ మహాకూటమి నుంచి బయటకు రావడంపై సీతారం ఏచూరి మాట్లాడుతూ నితీశ్‌ను రాజకీయ అవకాశవాదిగా వ్యాఖ్యానించారు. గత నెల బిజెపిని వీడిన అనంతరం స్పందించిన ఏచూరి బిజెపి తన మెడిసిన్‌ను తనే రుచి చూసిందన్నారు. మహారాష్ట్రలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చి శివసేన తిరుగుబాటుదారులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఆవిధంగా స్పందించారు. బిహార్‌లో మహాఘట్‌బంధన్‌ను సమర్థించిన ఏచూరి నితీశ్ రాజకీయ భవితపై ముందే వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News