Wednesday, March 22, 2023

నీవేందో..నేనేందో.. వనపర్తి ప్రజలకు తెలుసు

- Advertisement -

talk

*సమయం వచ్చిన రోజు అన్ని ఆధారాలతో వస్తా
*ఆదాయానికి మించి ఆస్థులపై ఎసిబి, సిబిసిఐడి విచారణ కోరతా
*చేతనైతే కృష్ణవేణి షుగర్‌కు కేటాయించిన ఒక టిఎంసి నీటిని, శ్రీనివాస థియేటర్ అనుమతిని రద్దు చేయించు
*నిరంజన్‌రెడ్డి ప్రెస్‌మీట్ వ్యాఖ్యలపై ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి ఫైర్

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: వనపర్తి నియోజక వర్గంలో శాసన సభ్యుడిగా తానేందో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నీవేందో ప్రజలందరికి తెలుసని సమయం వచ్చినప్పుడు పూర్తి ఆధారాలు చూపించి ఎసిబి, సిబిసిఐడి విచారణ కోరేందుకైనా వెన కాడబోనని ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి, రా్రష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. శుక్రవారం నిరం జన్‌రెడ్డి వనపర్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న పలు ఆరోపణలపై ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి ఘాటుగా స్పందించారు. తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఎవ్వరిని ఒక్కపైసా అడగలేదని నియోజకవర్గ అభివృద్ధి కోసమే గతంలో కొత్తకోట మండలం అప్పరాల దగ్గర కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగిందని, షుగర్ ఫ్యాక్టరీతో ఎంతో మంది నిరుద్యో గులకు, రైతులకు మంచి దిగుబడి నిచ్చే చెరుకు పంట కోసమే కొత్తకోట మండలంలో ఏర్పాటు చేయ డం జరిగిందని, రైతుల ప్రయోజనం తప్పా తనకు ఎలాంటి ఒప్పందం లేద ని, వనపర్తి పట్టణంలోని బండార్ నగర్‌లో ఏర్పాటు చేసిన శ్రీనివాస థియేటర్ ప్రాంతాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకే కమర్షియల్  ఏరియాగా అనుమతులు తీసుకురావ డం జరిగిందని దాని వల్ల ఆ కాలనీ వాసులు ప్లాట్లకు ధరలు పెరిగి ఆనం దంగా ఉన్నారని, కృష్ణవేణి షుగర్ ప్యాక్టరీలో, శ్రీనివాస థియేటర్‌లో తన కు ఎలాంటి లావాదేవీలు లేవని చేత నైతే నిరూపించాలని ఎంఎల్‌ఎ చిన్నా రెడ్డి నిరంజన్‌రెడ్డికి సవాల్  చేశారు. ప్రభుత్వంలో ఉన్న నీవు కృష్ణవేణి షుగర్‌కు కెటాయించిన ఒక టిఎంసి నీటిని, శ్రీనివాస థియేటర్ అనుమతు లను రద్దు చేయించవచ్చుగదా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ వల్ల వనపర్తి జిల్లాలోని ఎంతో మంది రైతులు చెరుకు పంటలు సాగు చేసి ఎకరాకు రూ.25 వేల నుండి రూ. 30 వేల అదనపు ఆదాయాన్ని పొందు తుందన్నారని ఆయన గుర్తు చేశారు. నిరంజన్‌రెడ్డి ఆరోపణలన్ని అవివేకా నికి నిదర్శనమన్నారు. వనపర్తి నియో జక వర్గాన్ని  పారిశ్రామికంగా అభి వృద్ధ్ది చేసేందుకే నియోజక వర్గంలోని పెబ్బేరు మండలం రంగాపురం శివారులో రూ. 150 కోట్ల నుండి రూ.200 కోట్ల వ్యయంతో సస్తా బయోటెక్ అనే లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని ఆ ఫ్యాక్టరీ వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి పొందు తున్నారన్నారు. లిక్కర్ ఫ్యాక్టరీలో తనకు నయాపైసా ముట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని ఆయన పేర్కొన్నారు.
వనపర్తి అభివృద్ధే తప్పా మరో ఆలోచన లేదు: తన యవ్వనం మొదలుకొని ప్రస్తుతం వరకు వనపర్తి నియోజక వర్గ అభివృద్ధి కోసమే పని చేస్తున్నాననిమరో ఆలోచనే లేదని ఎంఎల్‌ఎ తెలిపారు. నాపై ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమిం చరని ఒక్కరోజు నావెంబడి తిరిగితే ప్రజల్లో నీ ఆదరణ ఏందో, నా ఆదరణ ఏందో తెలుస్తుందని ఆయన తెలిపారు. బ్యాంక్ రుణం పొందేందుకే చిట్యాల రోడ్డులో ఉన్న భూమిని అధిక ధరకు రిజిస్ట్రేషన్ చేయించారు.చిట్యాల రోడ్డులో ఉన్న భూమిని అధిక ధరకు కొన్నట్లుగా కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి రుసు ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించడంతో ఆ సర్వే నెంబర్‌లో పేద రైతుల పొలాల కూడా అధికంగా రిజిస్ట్రేషన్ భారం పడడం జరిగిందని ఒక ఎకరాకు రూ.72. 60 లక్షలకు పెంచి బ్యాంక్ రుణాలు పొందారని పేద రైతుల కోసమే తాను స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ కమీషనర్‌కు లెటర్ రాయడం జరిగిందని తన లెటర్ తోవారు ఒకటి ,రెండు సార్లు వనపర్తికి వచ్చి పరిశీలించి వెళ్లారని పేద రైతుల కోసమే తాను కమీషనర్‌కులెటర్ రాశానని నేనేందో పెద్ద తప్పు చేసినట్లుగా క్షమించరాని నేరంగా నిరంజన్‌రెడ్డి ఆరోపించడం తన అవివేకానికి నిదర్శన మన్నారు. హైద్రాబాద్‌లో ఉన్న భారీ విలువ చేసే భవనాలు,పాన్‌గల్ మండల ంలో ఉన్న ఫాం హౌజ్‌లు నీకు ఎలా వచ్చాయని ,పాలమూర్ రంగారెడ్డి కాంట్రా క్టర్‌తో భారీ ఫాం ఫండ్స్‌ను తన పొలంలో త్రవ్వించి దానికి భీమా కాల్వను అనుసంధానం చేయలేదా అని ఎంఎల్‌ఎ నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఉన్న కాడికి కాలం గడుపుకొని రాజకీయాలు చేస్తే బాగుంటుందని ఎంఎల్‌ఎ సూచించారు. విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, పిసిసి సభ్యులు శ్రీనివాస్‌గౌడ్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధనలక్ష్మీ, జిల్లా నాయకులు తిరుపతయ్య,ఖమ్మర్‌మియ్యా, సహదేవ్ యాదవ్, రాగివేణు, బ్రహ్మయ్యాచారి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News