Saturday, April 20, 2024

కల్వకుంట్ల కవితకు దారిపొడుగునా స్వాగతం

- Advertisement -
- Advertisement -

Nizamabad MLC By Elections 2020

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థి కల్వకుంట్ల కవిత 90 శాతం మెజారిటీతో గెలవనుందనే ధీమా టిఆర్‌ఎస్ వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన పోలింగ్ అనంతరం టిఆర్‌ఎస్ అధిష్టానం ఈ అంచనాకు వచ్చింది. 854 ఓట్లలో టిఆర్‌ఎస్‌కు 570 సొంత బలం ఉన్నప్పటికీ ఇటీవల పార్టీలో చేరిన వారితోటు ఎంఐఎం మద్దతుతో సులువుగా 7 నుంచి 8 వందల ఓట్లు సాధించనున్నారనే ధీమాను పోలింగ్ అనంతరం నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల టిఆర్‌ఎస్ ఇంచార్జీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తం చేశారు.

దారి పోడుగునా కవితకు ఘన స్వాగతం

నిజామాబాద్ స్థానికసంస్థల ఎంఎల్‌సి అభ్యర్థి కల్వకుంట్ల కవిత పోలింగ్ సరళిని పరిశీలించేందుకు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు బయలు దేరారు. అయితే నిజామాబాద్‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నిజామాబాద్ చేరుకునేంత వరకు దారిపొడుగునా ప్రజలు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు కవితకు ఘనస్వాగతం పలికారు. నిజమాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా కవిత చేసిన సేవలను గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా భారీ మెజారిటీతో గెలిచి తిరిగి నిజమాబాద్ జిల్లా ప్రజలకు సేవలు అందించాలని ఆశీర్వదించారు. అనంతరం కవిత నిజమాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో పర్యటించారు. కామరెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్‌తో కలిసి స్థానిక పోలింగ్ సరళిని పరిశీలించారు. అనతంరం బోధన్ ఎంఎల్‌ఏ షకీల్ అహ్మద్‌తో కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. బోధన్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని పోలింగ్ బుత్‌లో ఓటింగ్ సరళిని పరిశీలించారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయం దగ్గర టపాకాయలు కాల్చి కవితకు స్వాగతం పలికారు.

ఏకపక్షంగా ఓటింగ్- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రతినిధులు ఏకపక్షంగా టిఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు ఓటువేసినట్లు సమాచారం ఉందని రాష్ట్ర మంత్రి, నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జీ వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతరాత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారని చెప్పారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఓటువేయడంతో కల్వకుంట్ల కవిత 80 నుంచి 90 శాతం మెజారిటీతో రికార్డు సృష్టించ నున్నారనే ఆశాభావం వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు, రైతులకు బాండ్ పేపర్లు రాసి ఇచ్చి మోసం చేసిన బిజెపి అభ్యర్థిని గెలిపించి పొరపాటు చేశామని స్థానిక సంస్థల ప్రతినిధులు విచారం వ్యక్తం చేసినట్లు చెప్పారు. మాయమాటలకు మోసపోయామని పశ్చాత్తాపడుతున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం కవితను గెలిపించే అవకాశం రావడంతో ఎంతో ఉత్సాహంగా కవితకు ఓటు వేసారని వేముల చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News