Thursday, March 28, 2024

రెండు యునెస్కో హెరిటేజ్ అవార్డులు గెలుచుకున్న నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్ట్

- Advertisement -
- Advertisement -

Nizamuddin Basti project won two UNESCO Heritage Awards

న్యూఢిల్లీ: భారత్‌కు రెండింత ఆనందం కలిగింది. ఈ ఏడాది యునెస్కో ఆసియాపసిఫిక్ అవార్డుల్లో కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ విభాగంలో రెండు కేటగిరిల్లో భారత అవార్డులు గెలుచుకుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్టు ఆచరణాత్మకంగా పట్టణ పునరుజ్జీవనంలో తనదైన రీతిలో లక్షాన్ని సాధించినందుకుగాను రెండు కెటగిరిల్లో యునెస్కో అవార్డును గెలుచుకుంది.ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మమైన ‘అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డును, అలాగే ‘స్పెషల్ రికగ్నిషన్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్’ కేటగిరిలో మరో అవార్డును గెలుచుకుంది. భారత్, చైనా,బంగ్లాదేశ్, జపాన్, మలేషియా, థాయ్‌లాండ్ ఆరు దేశాల నుంచి తొమ్మిది ప్రాజెక్టులకు వారసత్వ నిపుణుల జ్యూరీ అవార్డులను ఇచ్చింది. ఆసియాపసిఫిక్ ప్రాంతంలోని 12 దేశాలకు చెందిన మొత్తం 39 ఎంట్రీలను అవార్డు న్యాయమూర్తులు నవంబర్‌లో సమీక్షించాక ఈ అవార్డులను ఇచ్చారు.

జపాన్‌కు చెందిన మియాగిలోని కెసెన్నుమా హిస్టారిక్ సిటీస్కేప్ విశిష్ట అవార్డు(అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్)ను గెలుచుకుంది. కాగా బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న డోలేశ్వర్ హనాఫియా జామే మసీదుకు ప్రతిభ అవార్డు(అవార్డ్ ఆఫ్ మెరిట్) దక్కింది. మలేషియాలోని పెనాంగ్‌లో ఉన్న థాయ్ పక్ కూంగ్ మందిరానికి కూడా మెరిట్ అవార్డు లభించింది. దక్షిణ ఢిల్లీలో నిజాముద్దీన్ బస్తీ ప్రాజెక్టు 2007లో మొదలయింది. అక్కడి ప్రజల జీవన స్థాయిని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది యునెస్కో అవార్డులు రెండు భారత్ గెలుచుకోవడంపై ‘ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’(ఎకెటిసి) హర్షాన్ని వ్యక్తంచేసింది. ఈ ట్రస్టే స్థానిక సంస్థ, భారత పురావస్తు సర్వే, మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News