Friday, April 19, 2024

మానవత్వానికే మాయని మచ్చ

- Advertisement -
- Advertisement -

No animal deserves cruelty says Rohit Sharma

ముంబై : కేరళలో మహిళా ఏనుగు హృదయవిదారక పరిస్థితుల్లో మృతిచెందడం తనను ఎంతో కలచి వేసిందని భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనుగు పట్ల కొందరూ వ్యవహరించిన తీరు మానవత్వానికి మాయని మచ్చగా అభివర్ణించాడు. ఈ విషాద ఘటన గురించి వింటుంటే కళ్లలో నీళ్లు తిరిగాయన్నాడు. మానవుడు రాను రాను ఎంత క్రూరంగా మారుతున్నాడో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నా డు. ఆహారం కోసం వచ్చిన ఏనుగు పట్ల కొందరూ వ్యవహరించిన తీరు తనను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోందని రోహిత్ అన్నాడు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరాడు.

మానవత్వం మరచి ఇలాంటి వికృత చర్యలకు ఎలా పాల్పడుతారో తనకు అంతుబట్టడం లేదన్నాడు. అభం శుభం తెలియని ఏనుగును ఆహారం పేరిట మోసం చేసి దాని మృతికి కారకులైన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని రోహిత్ సూచించా డు. నిండు గర్భిణీగా ఉన్న అమాయక ఏనుగు కొందరి సిగ్గుమాలిన చర్యలకు తనువు చాలించడం ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. భవిష్యత్తులో మరే జంతువు ఇలా మానవుడి క్రూరత్వానికి బలికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నాడు. దీనికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తేనే ఆ మరణించిన ఏనుగు, దాని గడుపులో ఉన్న బిడ్డ ఆత్మశాంతి కలుగుతుందన్నాడు.

కఠినంగా శిక్షించాలి..

తమ వికృత ఆనందం కోసం అభంశుభం తెలియని ఏనుగు ప్రాణాలను తీసిన వారిపై సోషల్ మీడియా వేదికగా క్రీడా ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని ఓ నది వద్ద ఆహారం కోసం వచ్చిన ఓ మహిళా ఏనుగుకు కొందరూ రాక్షసులు పేలుడు పదార్థాలతో కూడిన పైన్ ఆపిల్‌ను అందించారు. మానువులను నమ్మి ఆ పండును తిన్న అమాయక ఏనుగు తీవ్ర గాయాలకు గురైంది. కొన్ని రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఏనుగు చివరికి తనువును చాలించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వెలుగు చూసింది.

ఓ అటవీ శాఖాధికారి దీన్ని పోస్ట్ చేశారు. దీంతో ఈ విషాద ఘటన విషయం బయటకు వచ్చింది. కాగా, సోషల్ మీడియాలో ఏనుగు దీన గాథను విని దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కన్నీళ్ల పర్యంతరం అయ్యారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ వార్త విని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి, వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా తదితరులు కూడా దీనిపై స్పందించారు. ఈ చర్యకు పాల్పడిన వారిని విడిచి పెట్టొద్దని వారు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News