Wednesday, April 24, 2024

ఎస్‌విబికి బెయిలవుట్ ప్రతిపాదన లేదు

- Advertisement -
- Advertisement -

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు బెయిల్ అవుట్ ఇచ్చే ప్రతిపాదనేది లేదని, కానీ డిపాజిటర్ల సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని అమెరికా ఆర్థికమంత్రి జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డిపాజిటర్లకు 2.50 లక్షల డాలర్ల వరకు బీమా చేస్తుంది. కానీ అనేక కంపెనీలు, స్టార్టప్ ఖాతాదారులు వారి అకౌంట్లలో అంతకంటే ఎక్కువగా డబ్బును కల్గివున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో యెల్లెన్ ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ, తదుపరి చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. అయితే 15 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే ఎస్‌విబి పరిస్థితి చాలా భిన్నమైందని అన్నారు. ఆ సమయంలో పరిశ్రమను కాపాడేందుకు బ్యాంక్ బెయిలవుట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలా మళ్లీ చేయబోమని, కానీ ఆందోళన చెందుతున్న డిపాజిటర్లను కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఆమె అన్నారు.

నేడు ఫెడరల్ రిజర్వ్ అత్యవసర సమావేశం
ఎస్‌విబి సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వు చర్యలు చేపట్టింది. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఫెడరల్ రిజర్వ్ ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా సోమవారం అంటే మార్చి 13న అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. దీనిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి గాను తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఫెడ్ రిజర్వు ఇప్పటికే బ్యాంకింగ్ అధికారులతో కూడా చర్చించి పరిష్కారాన్ని అన్వేషించిందని తెలుస్తోంది. ఎస్‌విబి సంక్షోభాన్ని వీలైనంత త్వరగా నియంత్రించేందుకు ఫెడ్ చర్యలు చేపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News