Home తాజా వార్తలు రైతుకు కులం లేదు: కెసిఆర్

రైతుకు కులం లేదు: కెసిఆర్

CM-KCR

హైదరాబాద్: రైతుకు కులం లేదని ఎవరు వ్యవసాయం చేస్తే వారే రైతని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. హెచ్‌ఐసిసిలో సోమవారం రైతుబంధు, జీవిత బీమా పథకంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో కెసిఆర్ మాట్లాడారు. ఆగష్టు 15 నుంచి రైతు జీవిత బీమా పథకం అమలవుతుందని,  18 నుంచి 60 ఏళ్ల వరకు ఏ కారణంతో రైతు చనిపోయినా బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఇప్పటికి అప్పుల్లోనే వున్నారని చెప్పారు. రైతు క్షేమంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. 2019 తరువాత కాళేశ్వరం పూర్తవుతుందని, వానల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పని లేదని మండిపడ్డారు.

పైసా ఖర్చు లేకుండా రైతులందరికీ బీమా ఇస్తున్నామని వివరించారు. సీజన్ వచ్చిందంటే మళ్లీ అప్పుకోసమే రైతులు వెతుకుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు ఉండవని, ఇక జనరేటర్లు అవసరం లేదన్నారు. రైతు బీమా పథకం తన జీవితంలో గొప్ప పని అని కొనియాడారు. అర్హులైన రైతులందరికీ ఐదు లక్షల రూపాయల బీమా ఇస్తామని వెల్లడించారు. నీటి కొరత లేని తెలంగాణే తన లక్ష్యమన్నారు. బీమాను ప్రతి రైతూ తీసుకోవాలని, తాను తీసుకుంటానన్నారు. 60 ఎకరాల రైతు హైదరాబాద్‌లో కూలీ చేస్తున్నాడని, 60 ఎకరాలు ఉండి ఏం లాభం, నీళ్లు లేవు కరెంట్ రాదని కెసిఆర్ తెలిపారు.