Friday, March 29, 2024

కాబూల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత లేదు

- Advertisement -
- Advertisement -

No clarity about any entity forming government in Kabul

విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడి

న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏ సంస్థ ఏర్పాటు చేస్తుందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదని విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాబూల్‌లో కొత్త ప్రభుత్వం ఎంత మేరకు అన్ని వర్గాలతో కూడుకుని ఉంటుందనే దానిపై భారత్ వేచి చూస్తోందని, ఎందుంటే అక్కడ వాప్తవ పరిస్థితి చాలా అనిశ్చితిగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం ఇక్కడ ప్రతివారం జరిగే విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ‘ కాబూల్‌లో ఏ సంస్థ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే దానిపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు.

ప్రభుత్వంలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై బోలెడన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుందా, అఫ్ఘన్ రాజకీయ పార్టీలకు చెందిన ఎవరికైనా ప్రాతినిధ్యం ఉంటుందా అనేది మరో ప్రశ్న అని బాగ్చీ అన్నారు. కాబూల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల గురించి ప్రభుత్వానికి తెలుసునని కూడా ఆయన అన్నారు. అంతేకాదు అఫ్ఘన్‌లో నెలకొని ఉన్న గందరగోళ పరిస్థితుల్లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడం అనేది తొందరపాటు చర్యే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితిని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని, భాగస్వామ్య దేశాలతో టచ్‌లో ఉన్నామని ఆయన అంటూ, ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన కీలక అంశాలు ఇంకా స్పష్టం కాలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News